Tamil Nadu Jallikattu Guidelines: వీడిన ఉత్కంఠ.. జల్లికట్టుపై సీఎం స్టాలిన్‌ కీలక నిర్ణయం

Jallikattu: Tamil Nadu Government Issues Guidelines For Event - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు సాంప్రదాయ ఆట జల్లికట్టు నిర్వహణపై ఉత్కంఠ వీడింది. జల్లికట్టుపై సీఎం స్టాలిన్ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏటా నిర్వహించే జల్లికట్టుకు ఈ ఏడాది కూడా అనుమతిస్టున్నట్టు ఆయన ప్రకటించారు. దాంతోపాటు జల్లికట్టు కార్యక్రమ నిర్వహణపై తమిళనాడు ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. పోటీల్లో పాల్గొనేందుకు కేవలం 300 మందికి మాత్రమే అనుమతించింది.

అలాగే పోటీలను తిలకించేందుకు 150 మంది ప్రేక్షకులు లేదా 50 శాతం సిట్టింగ్‌ సామర్థ్యానికి  (ఏది తక్కువ అయితే అది) అనుమతి ఇచ్చింది. పోటీదారులు, ప్రేక్షకులు రెండుడోసుల వ్యాక్సిన్‌ తీసుకోవాలని,  పోటీల ప్రారంభానికి  48 గంటల ముందు కోవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది. 
చదవండి: తమిళనాడులో భర్త ఇంటి ముందు యువతి ధర్నా

అయితే రాష్ట్రంలో కోవిడ్ కేసుల పెరుగుతున్న నేపథ్యంలో జల్లికట్టు కార్యక్రమాన్ని టీవీలలో చూడాలని, పెద్దఎత్తున గుమిగూడకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సూచించింది. కాగా మధురై జిల్లాలో ఈనెల 14 నుంచి జల్లికట్టు పోటీలు ప్రారంభంకానున్నాయి. కనుమ పండుగ రోజున జల్లికట్టును అంగరంగ వైభంగా నిర్వహిస్తారు. మదురైకి దగ్గర్లో ఉన్న అలంగనల్లూరు దగ్గర నిర్వహించే ఈ పోటీలను చూడడానికి భారీ సంఖ్యలో జనం హాజరవుతారు.
చదవండి: అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి ప్రపంచంలోనే అతిపెద్ద తాళం!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top