వైరల్‌ వీడియో: చీరకట్టులో అద్భుత విన్యాసం.. నెటిజన్లు ఫిదా!

Jaipur Woman Performs Backflip In Saree Video Goes Viral - Sakshi

జైపూర్‌: భారతీయ సాం‍ప్రదాయంలో చీరకట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అమ్మాయిల అందం చీర కట్టులో డబుల్‌ అవుతుందనడంలో సందేహం లేదు. అదే చీర కట్టులో స్టంట్స్‌ చేస్తే ఎలా ఉంటుంది? సివంగి దూకినట్టు కదా..! మరి ఆ సివంగి తలకిందులుగా జంప్‌ చేస్తే..! తాజాగా ఓ యువతి చీర కట్టులో చేసిన స్టంట్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఎరుపు రంగు చీరకట్టుకుని బ్యాక్‌ఫ్లిప్ చేస్తున్న యువతిని చూసిన చుట్టు పక్కల వారు నోళ్లు వెళ్లబెట్టారు. కాగా జైపూర్‌కి చెందిన మిషా శర్మ అనే ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ఈ ఫీట్‌ను చేసి ఔరా అనిపించింది. ఇప్పటి వరకు ఈ వీడియోను 3 కోట్ల మంది నెటిజన్లు వీక్షించగా.. లక్షల మంది లైక్‌ కొట్టి, కామెంట్‌ చేస్తున్నారు. 

ఈ వీడియోపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘‘యువతి చేసిన ఈ ఫీట్‌ నన్ను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. కలలు కనండి... వాటిని సాకారం చేసుకోండి.’’ అంటూ కామెంట్‌​ చేశాడు. మరో నెటిజన్‌ ‘‘అబ్బా! ఫీట్‌ అదిరిపోయింది. నా గుండె జారిపోయింది.’’ అంటూ చమత్కరించాడు. కాగా నెటిజన్‌ల కామెంట్స్‌ పై మిషా శర్మ స్పందిస్తూ.. ‘‘3 కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అయితే సరియైన మార్గదర్శకత్వం లేకుండా ఈ విన్యాసాలు ప్రదర్శిస్తే ప్రమాదకరంగా ఉంటాయి. అందువల్ల, మీరు శిక్షణ లేకుండా అలాంటి ఫ్లిప్స్ చేయవద్దు’’ అని ఆమె సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top