corona:ముందు ప్రాథమిక పాఠశాలలు తెరిస్తే మంచిది: ఐసీఎంఆర్‌

It will be wise to open primary schools first:ICMR chief - Sakshi

టీచర్లందరికి వ్యాక్సినేషన్‌ పూర్తయితే స్కూళ్లు తెరవొచ్చు: ప్రొ.భార్గవ

ఇన్‌ఫెక్షన్‌ తట్టుకునే సామర్థ్యం చిన్నారులకు ఎక్కువ: ప్రొ.భార్గవ

ముందు ప్రాథమిక పాఠశాలలు తెరిస్తే మంచిది: ప్రొ.భార్గవ

సాక్షి,న్యూఢిల్లీ: కరోనా విలయం,లాక్‌డౌన్‌ ఆంక్షలతో స్కూలు విద్య బాగా దెబ్బతింది. తాజాగా స్కూళ్ల  ప్రారంభంపై ఐసీఎంఆర్‌ సెక్రటరీ డాక్టర్ బలరామ్ భార్గవ కీలక సూచనలు చేశారు. ముందు ప్రాథమిక పాఠశాలలను తెరిస్తే మంచిదని సూచించారు. ఎందుకంటే ఇన్‌ఫెక్షన్‌ను తట్టుకునే సామర్థ్యం చిన్నారులకు ఎక్కువగా ఉంటుందన్నారు. అలాగే టీచర్లందరికి వ్యాక్సినేషన్‌ పూర్తయితే స్కూళ్లు తెరవొచ్చని ఆయన పేర్కొన్నారు.

సెకండరీ పాఠశాలలకంటే ముందు ప్రాధమిక పాఠశాలలను పునఃప్రారంభిస్తే మంచిదనే సంకేతాలను ప్రభుత్వం మంగళవారం అందించింది. అయితే దీనికంటే ముందు పాఠశాలల బస్సు డ్రైవర్లు, ఉపాధ్యాయులు, పాఠశాలలోని  ఇతర సిబ్బందికి టీకాలు వేయడం అవసరమని ఐసీఎంఆర్ డీజీ  భార్గవ  అన్నారు.

కాగా దేశంలో 2-18 ఏళ్ల లోపు వారికి కరోనా టీకా అందించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారత్ బయోటెక్ కోవాక్సిన్ టీకా రెండు,మూడు దశల ట్రయల్స్‌ డేటా త‍్వరలోనే వెల్లడికానుందని, దీంతో సెప్టెంబర్ నాటికి టీకా లభించనుందనే అంచనాలను ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా ఇటీవల చెప్పారు. డ్రగ్ రెగ్యులేటర్ ఆమోదంతో పిల్లలకు ఈ టీకా అందుబాటులో ఉంటుందని  పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top