breaking news
shcools
-
స్కూల్లో రక్తపాతం.. వీడియో గేమ్‌పై బ్యాన్
ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఓ విషాదకర పాఠశాల కాల్పుల ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి తరచూ ఆడే హింసాత్మక వీడియో గేమ్‌ను ప్రభుత్వం నిషేధించడంతో వీడియో గేమ్స్ నిజంగానే యువతను హింసాత్మకంగా మారుస్తాయా? అనే ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే..ఫిలిప్పీన్స్‌లోని టాక్లోబన్ నగరంలోని ఓ హైస్కూల్లో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు, నిందితుల్లో ఒకరు గోరేబాక్స్(GoreBox) అనే హింసాత్మక వీడియో గేమ్‌ను తరచూ ఆడేవాడని గుర్తించారు. ఈ నేపథ్యంలో జాగ్రత్త చర్యగా ఆ గేమ్‌పై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ప్రకటించింది.GoreBox అనేది ఆయుధాలు, పేలుళ్లు, రక్తపాతం, విధ్వంసక చర్యలతో కూడిన సాండ్‌బాక్స్ తరహా గేమ్. ఇందులో ఆటగాళ్లు వివిధ రకాల ఆయుధాలను ఉపయోగించి వర్చువల్ ప్రపంచంలో హింసాత్మక చర్యలకు పాల్పడవచ్చు. గేమ్‌లోని కంటెంట్ కారణంగానే ఇది గతంలో కూడా విమర్శలు ఎదుర్కొంది. అయితే ఈ గేమ్‌ను ఆడిన వ్యక్తే కాల్పులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.అయితే, ఇక్కడే అసలు చర్చ మొదలైంది. గేమ్ ఆడిన వ్యక్తి నేరానికి పాల్పడితే, ఆ నేరానికి గేమ్‌ను కారణంగా చూపవచ్చా? అనే ప్రశ్నకు నిపుణులు అంత సులభంగా సమాధానం చెప్పడం లేదు. ఇప్పటివరకు దర్యాప్తు అధికారులు కూడా గేమ్ వల్లే కాల్పులు జరిగాయి అని ఎక్కడా ప్రకటించలేదు. కేవలం నిందితుడు ఆ గేమ్‌ను ఎక్కువగా ఆడేవాడని మాత్రమే వెల్లడించారు.ఇక విచారణలో మరో కీలక విషయం కూడా బయటకు వచ్చింది. నిందితులిద్దరూ కొంతకాలంగా పాఠశాలలో వేధింపులు, బుల్లీయింగ్ ఎదుర్కొన్నట్లు సమాచారం. అలాగే ఆయుధాలు ఎలా వారి చేతికి చేరాయి? కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మానసిక స్థితి ఏమిటి? వంటి అంశాలపై కూడా అధికారులు దృష్టి సారించారు. దీంతో ఈ ఘటన వెనుక కేవలం వీడియో గేమ్ మాత్రమే కాదు, అనేక సామాజిక, మానసిక కారణాలు ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే చర్చ కొనసాగుతోంది.పలు దేశాల్లో బ్యాన్స్.. కాగా.. అమెరికాలో కొలంబైన్, పార్క్‌లాండ్ వంటి పాఠశాల కాల్పుల ఘటనల తర్వాత వీడియో గేమ్‌లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే అనేక పరిశోధనలు హింసాత్మక గేమ్‌లు ఆడటం వల్ల కొందరిలో తాత్కాలిక ఆగ్రహం పెరగొచ్చని చెప్పినా, అవే నేరాలకు నేరుగా కారణమవుతాయని నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు లేవని తేల్చాయి. అయినప్పటికీ పలు దేశాలు గేమింగ్‌పై నియంత్రణలు విధించాయి. చైనాలో మైనర్లకు ఆన్లైన్ గేమింగ్‌పై కఠిన పరిమితులు అమల్లో ఉన్నాయి. అత్యధిక హింసాత్మక కంటెంట్ ఉన్న గేమ్‌లపై ప్రత్యేక నిఘా ఉంటుంది. జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా కొన్ని గేమ్‌ల విక్రయాలపై వయోపరిమితులు లేదా ఆంక్షలు ఉన్నాయి. దక్షిణ కొరియా కూడా ఒకప్పుడు మైనర్ల గేమింగ్‌పై పరిమితులు విధించింది.ప్రపంచవ్యాప్త చర్చ..ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ప్రస్తుతం GoreBoxపై శాశ్వత నిషేధం కాకుండా తాత్కాలిక ఆంక్షలు మాత్రమే విధించింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఘటన తర్వాత మరో విద్యార్థి కూడా ఇలాంటి దాడికి ప్రేరేపితుడయ్యే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. అందుకే పాఠశాల భద్రత, అత్యవసర ప్రతిస్పందన విధానాలపై ప్రభుత్వం పునఃసమీక్ష ప్రారంభించింది. ఫిలిప్పీన్స్ ప్రభుత్వం GoreBoxను బ్లాక్ చేసింది. కానీ దేశాన్ని వెంటాడుతున్న అసలు ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. ఒక 14 ఏళ్ల బాలుడి మొబైల్లో ఉన్న వీడియో గేమ్ ప్రమాదకరమా? లేక అతని చేతిలోకి చేరిన నిజమైన తుపాకీనా? గేమ్‌ను నిషేధించడం సులభమే. కానీ బుల్లీయింగ్, మానసిక ఒత్తిడి, పిల్లలపై పెరుగుతున్న డిజిటల్ ప్రభావం, ఆయుధాల లభ్యత వంటి సమస్యలకు సమాధానం కనుగొనడం అంత సులభం కాదు. అందుకే టాక్లోబన్ స్కూల్ షూటింగ్ కథ కేవలం ఒక వీడియో గేమ్ కథ కాదు.. ఇది నేటి సమాజం ముందున్న అసౌకర్యమైన ప్రశ్నల కథ. ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఈ విషాదం మాత్రం పాఠశాల భద్రతపై ప్రపంచవ్యాప్తంగా మరోసారి తీవ్ర చర్చకు కారణమైంది. -
నేడు విద్యా సంస్థలకు సెలవు
సాక్షి, అమరావతి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు బుధవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. తుపాను తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్, ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం కూడా కాకినాడ నుంచి నెల్లూరు వరకు ఉన్న జిల్లాల్లో విద్యా సంస్థలు తెరవరాదని ఆదేశించారు. -
మ్యాగజైన్ స్టోరీ 13 August 2021
-
స్కూళ్ల ప్రారంభంపై ఐసీఎంఆర్ కీలక సూచనలు
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా విలయం,లాక్డౌన్ ఆంక్షలతో స్కూలు విద్య బాగా దెబ్బతింది. తాజాగా స్కూళ్ల ప్రారంభంపై ఐసీఎంఆర్ సెక్రటరీ డాక్టర్ బలరామ్ భార్గవ కీలక సూచనలు చేశారు. ముందు ప్రాథమిక పాఠశాలలను తెరిస్తే మంచిదని సూచించారు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ను తట్టుకునే సామర్థ్యం చిన్నారులకు ఎక్కువగా ఉంటుందన్నారు. అలాగే టీచర్లందరికి వ్యాక్సినేషన్ పూర్తయితే స్కూళ్లు తెరవొచ్చని ఆయన పేర్కొన్నారు. సెకండరీ పాఠశాలలకంటే ముందు ప్రాధమిక పాఠశాలలను పునఃప్రారంభిస్తే మంచిదనే సంకేతాలను ప్రభుత్వం మంగళవారం అందించింది. అయితే దీనికంటే ముందు పాఠశాలల బస్సు డ్రైవర్లు, ఉపాధ్యాయులు, పాఠశాలలోని ఇతర సిబ్బందికి టీకాలు వేయడం అవసరమని ఐసీఎంఆర్ డీజీ భార్గవ అన్నారు. కాగా దేశంలో 2-18 ఏళ్ల లోపు వారికి కరోనా టీకా అందించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారత్ బయోటెక్ కోవాక్సిన్ టీకా రెండు,మూడు దశల ట్రయల్స్ డేటా త్వరలోనే వెల్లడికానుందని, దీంతో సెప్టెంబర్ నాటికి టీకా లభించనుందనే అంచనాలను ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా ఇటీవల చెప్పారు. డ్రగ్ రెగ్యులేటర్ ఆమోదంతో పిల్లలకు ఈ టీకా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. -
మనబడి నాడు నేడుతో పాఠశాలను అభివృద్ధిచేస్తాం
-
ఈసారి గుణ‘పాఠం’
కడప ఎడ్యుకేషన్: ఈసారి స్కూళ్లు తెరిచే సమయానికి పాఠ్య పుస్తకాలు చేతికందేలా ఉన్నాయి. గతం నుంచి నేర్చుకున్న పాఠాలతో అధికారులు తొందరగా మేలుకొన్నారు. ఒక అడుగు ముందుకేశారు. వేసవి సెలవులు ముగిసేలోపే పాఠ్యపుస్తకాలను తెప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మొదటి విడత పుస్తకాలను జిల్లాకు చేరాయని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ ఏడాది పాఠ్యపుస్తకాల కొరత లేకుండా జూన్ నాటికి స్కూల్స్ పాయింట్లకు చేర్చేందుకు విద్యాశాఖ ముందస్తు కసరత్తు చేస్తోంది. గత మూడు, నాలుగేళ్ల నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమై నెలలు గడిచినా అరకొరగానే పాఠ్యపుస్తకాలు అందేవి. ఈ విద్యా సంవత్సరంలో మాత్రం ఇలాంటి ఇబ్బందులేవీ తలెత్తకూడదని విద్యాశాఖ కరసత్తు మొదలు పెట్టి సకాలంలో చేర్చేందుకు శ్రీకారం చుట్టింది. వేసవి సెలవులు ముగిసే నాటికే ప్రింటర్ల నుంచి జిల్లా కేంద్రానికి ..అక్కడి నుంచి మండల వనరుల కేంద్రానికి పాఠ్య పుస్తకాలను చేర్చనుంది. తర్వాత పాఠశాలలువెంటనే విద్యార్థులకు అందజేసే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిసింది. 2017– 18 యూడైస్ ప్రకారం.... జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 2542, ప్రాథమికోన్నత పాఠశాలలు 272, ఉన్నత పాఠశాలలు 391 ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 91,750 మంది కాగా, ప్రాథమికోన్నత పాఠశాలలు – విద్యార్థులు 18,013 మంది ఉంటున్నారని అంచనా. అలాగే ఉన్నత పాఠశాలల్లో 92,769 మంది చదువుతున్నారు. గతేడాది ఈ సమయానికి ముద్రణ పక్రియనే మొదలు కాలేదు. ఆలస్యంగా పుస్తకాలు రావడంతో పాఠ పుస్తకాలతోనే చదువులు కొనసాగించాల్సి వచ్చింది. దీంతో విద్యాశాఖ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. 2019–20 విద్యా సంవత్సరానికి మొదటి విడతలో భాగంగా ఈనెల 18 నుంచి పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రంలోని గోడౌన్‌కు చేరుకుంటున్నాయి. ఇందులో 2వ తరగతికి ఇంగ్లీస్ రీడర్‌కు సంబంధించి 15.065 పుస్తకాలు, 8వ తరగతి ఫిజికల్ సైన్సు (ఇంగ్లీష్ మీడియం) 9641 పుస్తకాలు వచ్చాయి. 9వ తరగతి( తెలుగు మీడియం) సోషల్ పుస్తకాలు 7678 వచ్చాయి. రెండు మూడు రోజులలో తక్కిన పుస్తకాలు రానున్నాయి. మే చివరికల్లా అన్ని పుస్తకాలు జిల్లాకు రానున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపారు. 50 శాతం మేర రాగానే పంపిణీ ప్రారంభం: పాఠ్యపుస్తకాలకు సంబంధించి మన జిల్లాకు రావాల్సిన పాఠ్యపుస్తకాల్లో సగం పుస్తకాలు జిల్లాకు రాగానే పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఈ ఏడాది సకాలంలోనే పాఠ్యపుస్తకాలను అందించేందుకు కృషి చేస్తాం. – పి. శైలజ, జిల్లా విద్యాశాకాధికారి -
రేపటి నుంచి వేసవి సెలవులు
అనంతపురం ఎడ్యుకేషన్ : అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 23 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు ప్రకటించినట్లు డీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. ఇదిలాఉండగా ఎప్పుడూ లేనివిధంగా ఈసారి దాదాపు నెల రోజుల ముందే సిలబస్ పూర్తికాకపోయినా అన్ని తరగతులకు వార్షిక పరీక్షలు నిర్వహించి మమ అనిపించారు. ఆ తర్వాత మార్చి 28 నుంచి రెమిడియల్ టీచింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అమలులో చేతులెత్తేసింది. చాలా స్కూళ్లలో కనీసం 50 శాతం మంది కూడా పిల్లలు రావడం లేదు.


