ఆ రోజే క్యాన్సర్‌ బయటపడింది | Sakshi
Sakshi News home page

ఆ రోజే క్యాన్సర్‌ బయటపడింది

Published Tue, Mar 5 2024 5:48 AM

Isro chief Somnath recovers from stomach cancer - Sakshi

ప్రస్తుతం క్యాన్సర్‌ను జయించా: ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌

సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యుడి సంబంధ పరిశోధన కోసం భారత్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్‌–1 మిషన్‌ ప్రయోగంతో ఆనందంలో మునిగిపోయిన ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమ్‌నాథ్‌నూ అశుభ వార్త ఒకటి కొద్దిరోజులపాటు కలవరపాటుకు గురిచేసింది. ఆయన కడుపులో పెరుగుతున్న క్యాన్సరే అందుకు కారణం. శస్త్రచికిత్స, కీమోథెరపీ తర్వాత ఆయన ప్రస్తుతం క్యాన్సర్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

గత ఏడాది సెపె్టంబర్‌ రెండో తేదీన జరిగిన ఘటన తాలూకు వివరాలను ఆయన ఇటీవల వెల్లడించారు. టార్కామ్‌ మీడియా సంస్థ వారి ‘ రైట్‌ టాక్‌’ కార్యక్రమంలో భాగంగా ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో అందరితో ఆ విషయాలను పంచుకున్నారు. ‘‘ సెప్టెంబర్‌ రెండో తేదీన ఆదిత్య ఎల్‌–1 మిషన్‌ లాంఛ్‌ ప్రక్రియకు కొద్ది వారాల ముందు నుంచే కడుపు నొప్పిగా అది మొదలైంది. మొదట అదే ఏడాది జూలై 14వ తేదీన చంద్రయాన్‌–3 ప్రాజెక్ట్‌ సందర్భంగానూ అనారోగ్యం బారినపడ్డా.

ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పని ఒత్తిడి కారణంగా అలా అయ్యిందేమో అనుకుని దానిని సంగతి వదిలేశా. కానీ ఆ తర్వాతా కడుపు నొప్పి నన్ను వెంటాడింది. ఇక లాభం లేదనుకుని ఆదిత్య ఎల్‌–1 ప్రయోగం విజయవంతంగా పూర్వవగానే అదే రోజు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో స్కానింగ్‌లు, టెస్ట్‌లు చేయించుకున్నా. పెద్ద పేగులో చిన్నపాటి క్యాన్సర్‌ కణతి పెరుగుతోందని పరీక్షల్లో బయటపడింది. ఆ వార్త విని నా కుటుంబసభ్యులంతా షాక్‌కు గురయ్యారు.

కుటుంబసభ్యులే కాదు ఇస్రోలో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, ఇంజనీర్లు హుతాశులయ్యారు. శస్త్రచికిత్స తప్పదని వైద్యులు సూచించడంతో నాలుగు రోజులు ఆస్పత్రికే పరిమితయ్యా. సర్జరీ, కీమో థెరపీ తర్వాత ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా. ఏటా స్కానింగ్, చెకప్‌ చేయించుకుంటా. నాకు క్యాన్సర్‌ వంశపారంపర్యంగా వచి్చందని చెబుతున్నారు. దాన్ని జయించా. చిన్నపాటిది కాబట్టి మొదట్లోనే గుర్తించి శస్త్రచికిత్సతో తొలగించారు’’ అని సోమ్‌నాథ్‌ చెప్పుకొచ్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement