Indian Railways Has Around 2.5 Lakh Plus Posts Lying Vacant, Highest In Northern Zone - Sakshi
Sakshi News home page

Railway Jobs: రైల్వేలో భారీగా ఉద్యోగాలు ఖాళీ.. మొత్తం ఎన్ని లక్షల పోస్టులంటే?

Aug 9 2023 7:45 AM | Updated on Aug 9 2023 9:36 AM

Indian Railways Has 2 5 Lakh Plus Posts Lying Vacant - Sakshi

దేశంలో రైల్వేశాఖలో భారీగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఏకంగా 2.50 లక్షల ఉద్యోగాలు భర్తీచేయాల్సి ఉండటం గమనార్హం. ఈ మేరకు రైల్వేశాఖ పార్లమెంటుకు లిఖితపూర్వకంగా తెలిపిన సమాధానంలో పేర్కొంది.

సాక్షి, అమరావతి: దేశంలో రైల్వేశాఖలో భారీగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఏకంగా 2.50 లక్షల ఉద్యోగాలు భర్తీచేయాల్సి ఉండటం గమనార్హం. ఈ మేరకు రైల్వేశాఖ పార్లమెంటుకు లిఖితపూర్వకంగా తెలిపిన సమాధానంలో పేర్కొంది. దేశంలో అత్యధిక ఉద్యోగులు కలిగిన ప్రభుత్వ విభాగంగా మొదటిస్థానంలో నిలిచిన రైల్వేశాఖ.. దేశంలో అత్యధికంగా పోస్టులు ఖాళీగా ఉన్న విభాగంగాను గుర్తింపు పొందింది.

ఇక కీలకమైన ఆపరేషనల్‌ సేఫ్టీ విభాగంలో 53,178 పోస్టులు పెండింగులో ఉండటం గమనార్హం. దేశంలో అన్ని రైల్వేజోన్ల పరిధిలో కలిపి మొత్తం 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని రైల్వే శాఖ తెలిపింది. వాటిలో అత్యధికంగా గ్రూప్‌–సి ఉద్యాగాలే 2.48 లక్షలు ఖాళీగా ఉన్నాయి.

గ్రూప్‌–ఏ ఉద్యోగాలు 1,965, గ్రూప్‌–బి ఉద్యోగాలు 105 ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా నార్తర్న్‌ రైల్వేలో 32,636 పోస్టులు ఖాళీగా ఉండగా, అత్యల్పంగా దక్షిణ పశ్చిమ రైల్వే జోన్‌లో 4,897 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
చదవండి: టీడీపీ నేతకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ మంజూరు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement