India-China: చైనాకు గట్టి షాకిచ్చిన భారత్‌

India Suspends Tourist Visas For Chinese Citizens - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: డ్రాగెన్‌ కంట్రీ చైనా కవ్వింపులకు భారత్‌ మరోసారి గట్టి సమాధానం చెప్పింది. చైనా జాతీయులకు జారీ చేసిన పర్యాటక వీసాలను భారత్‌ సస్సెండ్‌ చేస్తున్నట్టు గ్లోబల్ ఎయిర్‌లైన్స్ బాడీ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) తెలిపింది. కాగా, కోవిడ్‌ కారణంగా భారత విద్యార్ధులు(22వేల మంది) చైనా నుండి స్వదేశానికి తిరిగి వచ్చారు. అనంతరం వారి రాకను చైనా తిరస్కరించింది. ఈ నేపథ్యంలో టిట్‌ ఫర్‌ టాట్‌ అన్నట్టుగా భారత్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే, పాకిస్తాన్‌, శ్రీలంక, థాయిలాండ్‌ నుండి వచ్చే విద్యార్థులను మాత్రం చైనా ఆహ్వానించింది. ఇదిలా ఉండగా.. గత నెలలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి భారత పర్యటనకు వచ్చిన సమయంలో మన దేశ విదేశాంగ మంత్రి జై శంకర్‌ విద్యార్థుల సమస్యను పరిష‍్కరించాలని ఆయనను కోరారు. అయినప్పటికీ చైనా నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. దీంతో భారత్‌ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా, ఏప్రిల్ 20న జారీ చేసిన సర్క్యులర్‌ ప్రకారం.."చైనా (పీపుల్స్ రిపబ్లిక్) పౌరులకు జారీ చేసిన టూరిస్ట్ వీసాలు ఇకపై చెల్లవు. భూటాన్, మాల్దీవులు, నేపాల్ జాతీయులు, భారత్‌ జారీ చేసిన నివాస అనుమతి ఉన్నవారు, ఇ-వీసా ఉన్నవారు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డ్ లేదా బుక్‌లెట్ ఉన్నవారు, PIO కార్డ్ ఉన్నవారు, దౌత్య పాస్‌పోర్ట్ హోల్డర్లు మాత్రమే భారత్‌లోకి అనుమతించబడతారు’’ అని పేర్కొంది.

ఇది చదవండి: ఏప్రిల్‌ 27న ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top