కెనడా ప్రధాని వ్యాఖ్యలు: భారత్‌ హెచ్చరిక!

India Summons Canada Over Justin Trudeau Comments On Farmers Protest - Sakshi

న్యూఢిల్లీ : కేం‍ద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తోన్న సంగతి తెలిసిందే. రైతుల ఆందోళనపై కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో, పార్లమెంట్‌ సభ్యులు చేసిన వ్యాఖ్యలను భారత్‌ తప్పుబట్టింది. భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా తలదూర్చడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి చర్యలు ఇకపై కొనసాగితే ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రకటనలో కెనడా హైకమిషనర్‌కు ఆ దేశ మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యల తీవ్రతను తెలియజేసింది. ( తల్లి మాటతో.. కోట్లు సంపాదించాడు )

కెనడాలోని భారత కమిషన్‌, కౌన్సిలేట్ల ముందు ఉగ్రవాద కార్యాకలాపాల సమావేశాలను ప్రోత్సహించటం శాంతి, భద్రతలకు ముప్పవుతుందని తెలిపింది. కాగా, గత సోమవారం గురునానక్‌ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కెనడా ప్రధాని ట్రూడో ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనపై మాట్లాడుతూ.. ‘‘ శాంతియుతంగా నిరసనలు చేపట్టే హక్కులకు కెనడా ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుంది’’ అని అన్నారు. (ఆ బాధను అర్థం చేసుకోగలను: ట్రూడో)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top