541 రోజుల కనిష్టానికి యాక్టివ్‌ కేసులు | India logs 8318 new COVID-19 cases in last 24 hours | Sakshi
Sakshi News home page

541 రోజుల కనిష్టానికి యాక్టివ్‌ కేసులు

Nov 28 2021 6:10 AM | Updated on Nov 28 2021 6:10 AM

India logs 8318 new COVID-19 cases in last 24 hours - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో ఒక్క రోజు వ్యవధిలో మరో 8,318 కరోనా కేసులు వెలుగులోకి రావడంతో మొత్తం కేసులు 3,45,63,749కు చేరుకున్నట్లు కేంద్రం శనివారం తెలిపింది. అదే సమయంలో, యాక్టివ్‌ కేసులు 3,114 తగ్గడంతో మొత్తం యాక్టివ్‌ కేసులు 541 రోజుల తర్వాత అత్యల్పంగా 1,07,019గా నమోదైనట్లు పేర్కొంది. 24 గంటల వ్యవధిలో మరో 465 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందగా మొత్తం మరణాలు 4,67,933కు పెరిగాయని తెలిపింది. రికవరీ రేటు 98.34%గా ఉందని వెల్లడించింది. ఇప్పటి వరకు 121.06 కోట్ల కోవిడ్‌ వ్యాక్సిన్‌ డోస్‌లు వేసినట్లు తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement