భారత్‌ సైన్యం ప్రపంచంలోనే నాలుగో శక్తివంతమైంది

India has world's fourth strongest military says Military Directs study - Sakshi

న్యూఢిల్లీ: కమ్యూనిస్టు చైనా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిని కలిగి ఉండగా, భారత్‌ ఈ విషయంలో నాలుగో స్థానంలో ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. మొత్తం 100 పాయింట్లకు చైనా 82 పాయింట్లతో సూచికలో అగ్ర స్థానంలో నిలిచిందని పేర్కొంది. అమెరికా మిలటరీ బడ్జెట్‌ భారీగా ఉన్నప్పటికీ, 74 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తర్వాత 69 పాయింట్లతో రష్యా మూడో స్థానంలో, 61 పాయింట్లతో భారత్‌ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈ పట్టికలో యూకే 43 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచినట్లు మిలటరీ డైరెక్ట్‌ అనే డిఫెన్స్‌ వెబ్‌సైట్‌ ఆదివారం ఈ వివరాలను విడుదల చేసింది. మిలటరీ బడ్జెట్, యాక్టివ్, ఇన్‌ యాక్టివ్‌ సైనికుల సంఖ్య, త్రివిధ దళాలు, అణు సామర్థ్యం, సరాసరి వేతనాలు, ఆయుధ సామగ్రి వంటి వివరాలను పరిగణనలోకి తీసుకుని ‘అల్టిమేట్‌ మిలటరీ స్ట్రెన్త్‌ ఇండెక్స్‌’ను రూపొందించినట్లు తెలిపింది. ప్రపంచంలోనే భారీ మిలటరీ బడ్జెట్‌ను కలిగిన అమెరికా ఏడాదికి 732 బిలియన్‌ డాలర్లను వెచ్చిస్తుండగా చైనా 261 బిలియన్‌ డాలర్లు, భారత్‌ 71 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెడుతున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top