ఎల్‌ఏసీ వివాదం.. 1959 వాదనను అంగీకరించం: భారత్‌

India Disses 1959 LAC Claim and Watches for China Next Move - Sakshi

న్యూఢిల్లీ: 1959 నాటి వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)కు కట్టుబడి ఉంటామంటూ చైనా లేవనెత్తిన సరికొత్త వాదనను భారత్‌ నిర్ద్వంద్వంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 12న లద్దాఖ్‌లో జరిగే 7వ మిలిటరీ కమాండర్ల సమావేశంలో దీనిపై చైనా ఎలా స్పందించనుందనే దాని గురించి భారత్‌ ఎదురు చూస్తుందో. ఈ అంశంలో భారత్‌ బలంగా ఉంది. దీని గురించి జాయింట్‌ సెక్రటరీ(తూర్పు ఆసియా) భారత్‌-చైనా సరిహద్దు వ్యవహారాలపై నిర్వహించిన 19వ రౌండ్‌ వర్కింగ్‌ మెకానిజం ఫర్‌ కన్సల్టేషన్‌ అండ్‌ కో ఆర్డినేషన్‌(డబ్ల్యూఎంసీసీ)లో చైనా ప్రతినిధికి తెలిపారు. 1959లో అప్పటి చైనా ప్రధాని చౌఎన్‌లై పేర్కొన్న ఎల్‌ఏసీని అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తిరస్కరించినట్లు భారత్‌ ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఇక భారత్‌ తిరస్కరణకు సంబంధించి చైనా నుంచి ఎలాంటి స్పందన వెలువడలేదు. (చదవండి: చైనా వాదనను అంగీకరించం)

ఇక అక్సాయ్ చిన్ ప్రాంతంలో చైనా ఇప్పటికే 33,000 కిలోమీటర్ల భూమిని ఆక్రమించుకుందని, మరో 5,180 చదరపు కిలోమీటర్ల షాక్స్‌గమ్ వ్యాలీని 1963 లో పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా అప్పగించిందని భారత దౌత్యవేత్తలు అభిప్రాయపడ్డారు. వచ్చే వారం జరిగే మిలటరీ కమాండర్ల సమావేశంలో లద్దాఖ్‌లోని 1,597 కిలోమీటర్ల సరిహద్దు రేఖ వెంబడి ఆరు ఘర్షణ పాయింట్ల వద్ద ప్రస్తుత వివాదాలను పరిష్కరించడానికి కేంద్రంగా ఉన్న ఎల్‌ఏసి అవగాహనపై చైనీయులు తమ స్థానానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారని భారతదేశం ఆశిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top