వ్యాక్సిన్‌: నిర్మలా సీతారామన్‌ కీలక ప్రకటన

India announces Rs 900 crore for COVID-19 vaccine research - Sakshi

రూ.2.65 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ 3.0 ఉద్దీపన ప్యాకేజీ

వ్యాక్సిన్‌ అభివృద్ధికోసం రూ.900 కోట్లు

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ టీకా కోసం దేశమంతా ఎదురు చేస్తున్న వేళ కేంద్ర  ఆర్థికమంత్రి నిర‍్మలా సీతారామన్‌ కీలక విషయాన్ని ప్రకటించారు. కోవిడ్‌-19 మహమ్మారి అంతానికి సంబంధించి టీకా పరిశోధన, అభివృద్ధి కోసం  900 కోట్ల రూపాయల నిధులను ఆర్థిక మంత్రి  ప్రకటించారు. మూడవ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటనలో భాగంగా ఈ నిధులను ఆమె గురువారం వెల్లడించారు. (భారత్‌ చేరుకున్న రష్యా స్పుత్నిక్ వ్యాక్సిన్)

వ్యాక్సిన్ పరిశోధన,  అభివృద్ధికి మాత్రమే ఈ నిధులు వినియోగించనున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కోవిడ్‌ సురక్షా మిషన్‌ పేరుతో  ప్రకటించిన ఈ పథకం కోసం బయోటెక్నాలజీ విభాగానికి  ఈ నిధులను అందించినట్టు చెప్పారు. రూ .2.65 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ భారత్ 3.0 ఉద్దీపనలో ఇవి భాగమని తెలిపారు. కాగా ఇప్పటికే భారతదేశంలో పలు వ్యాక్సిన్ ట్రయల్స్  దశల్లో ఉన్నాయి. ఈ పరిశోధనల పురోగతిని అంచనా వేయడానికి  ప్రధానమంత్రి నరేంద్రమోదీ  సమీక్షా సమావేశాన్ని కూడా ఇటీవల నిర్వహించారు.  ఈ రివ్యూ మీటింగ్‌లో ఆరోగ్యమంత్రి హర్ష్ వర్ధన్, నీతి ఆయోగ్ సభ్యులు,  సీనియర్ శాస్త్రవేత్తలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. వ్యాక్సిన్‌ పరిశోధన,  అభివృద్ధి ఖర్చుతో కూడుకున్నదన్న అంచనాల అనంతరం ఈ నిధుల ప్రకటన రావడం విశేషం. మరోవైపు టీకా ఉత్పత్తిలో భారతదేశం పాత్రను డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ గురువారం ప్రశంసించిన సంగతి తెలిసిందే. (కరోనా వ్యాక్సిన్‌ : ఫైజర్‌ పురోగతి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

13-01-2021
Jan 13, 2021, 05:08 IST
న్యూఢిల్లీ/పుణే: ఈనెల 16వ తేదీన జరిగే దేశవ్యాప్త కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చకచకా జరిగి పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సోమవారం...
13-01-2021
Jan 13, 2021, 03:23 IST
సాక్షి, అమరావతి/గన్నవరం: రాష్ట్రానికి కోవిడ్‌ టీకా వచ్చేసింది. గన్నవరం విమానాశ్రయానికి కోవిడ్‌ టీకా బాక్సులు చేరుకున్నాయి. సీరం ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించిన...
12-01-2021
Jan 12, 2021, 16:44 IST
ప్రభుత్వ మెగా టీకా డ్రైవ్‌లో అందించే కోవిషైల్డ్ వ్యాక్సిన్ ధరపై స్పందించిన అదర్‌ పూనావాలా మొదటి 100 మిలియన్ మోతాదులకు మాత్రమే  200 రూపాయల ప్రత్యేక ధరకు అందించామన్నారు. ...
12-01-2021
Jan 12, 2021, 09:51 IST
ముంబై: ఏడాది పాటుగా కరోనా వైరస్‌తో కకావికాలమైన దేశం మరి కొద్ది రోజుల్లో ఊపిరి పీల్చుకోనుంది. వైరస్‌ని ఎదుర్కొనే కోవిడ్‌...
12-01-2021
Jan 12, 2021, 09:50 IST
ప్రాణాంతక కరోనా మహమ్మారి చైనాలోనే పుట్టిందని ప్రపంచవ్యాప్తంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
12-01-2021
Jan 12, 2021, 05:44 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ను అన్ని పీహెచ్‌సీల పరిధిలో ప్రారంభించడానికి అవసరమైన...
12-01-2021
Jan 12, 2021, 05:39 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్లు ఏమాత్రం పక్కదారి పట్టకుండా ఉండేందుకు, బ్లాక్‌ మార్కెట్లకు తరలకుండా ఉండటానికి గట్టి నిఘా పెట్టాలని...
12-01-2021
Jan 12, 2021, 04:46 IST
న్యూఢిల్లీ: కేంద్ర వార్షిక బడ్జెట్‌ ప్రతులను పార్లమెంట్‌ సభ్యులకు ఈసారి డిజిటల్‌ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌–19 ప్రొటోకాల్‌...
12-01-2021
Jan 12, 2021, 04:25 IST
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ దిశగా కీలక పరిణామం...
12-01-2021
Jan 12, 2021, 04:18 IST
న్యూఢిల్లీ: కరోనా టీకాను తొలిదశలో 3 కోట్ల మందికిపైగా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు అందజేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర...
11-01-2021
Jan 11, 2021, 17:31 IST
సాక్షి, న్యూఢిల్లీ: జనవరి 16వ తేదీనుంచి కరోనా వైరస్‌ మహమ్మారికి అంతానికి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ షురూ కానున్న నేపథ్యంలో కేంద్రం...
11-01-2021
Jan 11, 2021, 12:17 IST
కరోనా వైరస్‌ మహమ్మారి అమెరికాలో పురుషులతో పోలిస్తే  ఉపాధిని కోల్పోయిన వారిలో మహిళలే ఎక్కువ ఉన్నారు.
11-01-2021
Jan 11, 2021, 05:04 IST
లండన్‌ : బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్, ఆమె భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌కు కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ఇచ్చారు. విండ్సర్‌ కేజల్‌లో ఉంటున్న...
11-01-2021
Jan 11, 2021, 04:46 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానున్నారు. ఈ నెల 16వ...
11-01-2021
Jan 11, 2021, 04:41 IST
న్యూఢిల్లీ: కరోనా టీకా పంపిణీలో ‘కోవిన్‌’ యాప్‌ కీలక పాత్ర పోషించనుందని కేంద్రం ఆదివారం ప్రకటించింది. వ్యాక్సిన్‌ అందరికీ, అన్ని...
11-01-2021
Jan 11, 2021, 03:21 IST
సాక్షి, అమరావతి: కరోనా వ్యాక్సినేషన్‌కు రాష్ట్ర అధికార యంత్రాంగం పూర్తిగా సర్వసన్నద్ధమైంది. ఇప్పటికే జిల్లాల వారీగా కలెక్టర్లు ఈ ప్రక్రియను...
10-01-2021
Jan 10, 2021, 06:33 IST
భోపాల్‌: హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా టీకా ‘కోవాగ్జిన్‌’ తీసుకున్న 42 ఏళ్ల వలంటీర్‌ మృతి...
10-01-2021
Jan 10, 2021, 04:49 IST
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం భారత్‌లో ఈ నెల 16 నుంచి ప్రారంభం కానుంది. 3 కోట్ల...
10-01-2021
Jan 10, 2021, 04:39 IST
సాక్షి, అమరావతి: బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉండటం, అది ఇప్పటికే కొన్ని దేశాలకు...
09-01-2021
Jan 09, 2021, 09:46 IST
కరోనా వ్యాక్సిన్‌ డ్రైరన్‌లో అనేక సమస్యలు వెలుగుచూశాయి.
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top