సాక్షి, చెన్నై : చెన్నై శివారులోని మహాబలిపురం వద్ద పీసీ–7 ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలింది. శిక్షణలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ ట్రైనీ అధికారి పారాచూట్ సాయంతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చెన్నై శివారు తాంబరంలో భారత ఎయిర్‌ఫోర్సు స్టేషన్‌కు చెందిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఓ ట్రైనీ అధికారి శుక్రవారం టేకాఫ్ తీసుకున్నారు.
అయితే, మహాబలిపురం వద్ద బురదలో ఈ ఎయిర్‌క్రాఫ్ట్ కుప్పకూలి పేలిపోయింది. ట్రైనీ అధికారి పారాచూట్ సాయంతో సమీపంలోనే దిగేశాడు. ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


