లవర్‌తో భర్త షికార్లు.. షాపింగ్‌ మాల్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. తర్వాత..

Husband Shopping With Girlfriend Caught By Wife Video Viral - Sakshi

అతడికి అప్పటికే ఆమెతో వివాహం జరిగింది. వారి వివాహ బంధంలో కలతల కారణంగా భార్య.. భర్తకు దూరంగా పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో భర్త మరో యువతితో ఎంజాయ్‌ చేస్తూ షికార్లు చేస్తుండగా భార్య.. వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. షాకింగ్‌ మాల్‌లో అందరి ముందే చితకబాదింది. దీనికి సంబంధించిన ఘటన సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

వివరాల ప్రకారం..  యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన ఓ జంట మధ్య గొడవల కారణంగా భార్య.. తన పుట్టింట్లో ఉంటోంది. కాగా, కార్వా చౌతా పండుగ సందర్భంగా ఆమె తన తల్లితో కలిసి షాపింగ్‌ చేసేందుకు ఓ మాల్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా తన భర్త మరో యువతితో క్లోజ్‌ ఉండటం, షాపింగ్‌ చేస్తుండటాన్ని ఆమె గమనించింది. దీంతో, వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నిలదీసింది. భర్త కాలర్‌ పట్టుకుని.. నాకు ఎందుకు అన్యాయం చేస్తున్నావంటూ చితకబాదింది. అటు భర్తతో వచ్చిన సదరు యువతిని సైతం ఆమె కుటుంబ సభ్యులు చితకబాదారు. 

మరోవైపు.. ఈ ఘటనపై సదరు వ్యక్తి భార్య.. పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం. ఇక, ఈ ఘటన జరుగుతున్న సందర్భంగా షాపింగ్‌ మాల్‌లో పెద్ద సంఖ్యలో కస్టమర్లు అక్కడ గుమ్మిగూడారు. దీంతో, మాల్‌లోని కొందరు దుకాణాల యజమానులు బయటకు వెళ్లిపోవాలని సూచించారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top