భారీ ప్రవాహంలో చిక్కుకున్న కారు.. వీడియో వైరల్‌

Heavy Rain: Rescue As Car Struck In Two Mountains In Uttarakhand - Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తర ఖండ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే నైనిటాల్‌, తపోవన్‌, చంద్రబాగా నదులు నిండుకుండను తలపిస్తున్నాయి. అనేక చోట్ల రోడ్లపై కొండచరియలు విరిగిపడుతున్నాయి. కాగా, బద్రీనాథ్‌ జాతీయ రహదారిపై లంబగడ్‌నల్లా వద్ద కొండచరియలు విరిగిపడటంతో..  ఒక కారు రోడ్డుపై చిక్కుకుంది. వెంటనే స్పందించిన బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ అధికారులు క్రెన్‌ సహయంతో కారును సురక్షితంగా బయటకు తీసుకోచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇప్పటికే వరదలపై ప్రధాని మోదీ.. ఉత్తర ఖండ్‌ సీఎం పుష్కర్‌ ధామితో ఫోన్‌లో మాట్లాడారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.  కేంద్రంనుంచి పూర్తిస్థాయి సహాయం అందిస్తామని  తెలిపారు. వరదలలో ఇప్పటికే నేపాల్‌కు చెందిన ముగ్గురు కూలీలతోపాటు మరో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా చంపావ్‌ జిల్లా,సెల్‌ఖోలా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మరో ఇద్దరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం.. ఉత్తర ఖండ్‌లో 1 నుంచి 12 తరగతివరకు పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. వాతావరణం మెరుగుపడే ఎలాంటి పర్యాటకులకు అనుమతిలేదని అధికారులు స్పష్టం చేశారు. అదే విధంగా.. చంపావత్‌లోని చల్తి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. 

చదవండి: వైరల్‌: భర్త మరో మహిళతో జిమ్‌లో.. చెప్పులతో చితకబాదిన భార్య

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top