చంద్రయాన్‌-4లో నిన్ను పంపిస్తా.. మహిళతో హర్యానా సీఎం వెటకారం! | 'Will put you on Chandrayaan-4': Haryana CM Manohar Lal Khattar's Satirical Response To Woman - Sakshi
Sakshi News home page

చంద్రయాన్‌-4లో నిన్ను పంపిస్తా.. మహిళతో హర్యానా సీఎం వెటకారం!

Sep 8 2023 11:51 AM | Updated on Sep 8 2023 12:18 PM

Haryana CM Manohar Lal Khattar Satirical Response To Woman - Sakshi

చండీగఢ్‌: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఓ పేద మహిళ అడిగిన ప్రశ్నకు కోపంగా సమాధానం చెబుతూ వెటకారంగా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎం తీరుపై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వివరాల ప్రకారం.. తమ ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీ ఏర్పాటుచేయాలని కోరిన ఓ పేద మహిళను సీఎం ఖట్టర్‌ దారుణంగా అవమానించారు. ఈ సందర్భంగా ఆగ్రహానికిలోనైన ఖట్టర్‌.. ‘చంద్రయాన్‌-4తో నిన్ను కూడా పంపుతా.. కూర్చో’ అంటూ సదరు మహిళను ఉద్దేశించి వెటకారంగా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సీఎం ఖట్టర్‌ తీరుపై ప్రతిపక్షాలు నేతలు మండిపడుతున్నారు. 

ఖట్టర్‌ ‍వ్యాఖ్యలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్)‌ స్పందిస్తూ.. ‘ఉపాధి చూపమని సదరు మహిళ సీఎంను కోరటం నేరమా? సీఎం ఈ విధంగా మాట్లాడటం సిగ్గుచేటు. ప్రజా సేవచేయడానికి ఎన్నుకోబడ్డ నాయకులు.. ప్రజలపైనే పరిహాసమాడుతున్నారు.  ఇదే విధమైన డిమాండ్‌ ప్రధాని మోదీకి మిత్రులైన బడా కోటీశ్వరులు, కార్పొరేట్ల నుంచి వస్తే.. అప్పుడు మొత్తం హర్యానా ప్రభుత్వ యంత్రాంగమే వారి సేవలో నిమగ్నమయ్యేది’ అని ఆప్‌ ఎద్దేవా చేసింది. ఇక, కాంగ్రెస్‌ స్పందిస్తూ.. పేద మహిళ తన కష్టం చెప్పుకుంటే సీఎం ఖట్టర్‌కు నవ్వులాటగా ఉంది. మహిళల పట్ల బీజేపీకి గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి: ఆరు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం.. లైవ్‌ అప్‌డేట్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement