Happy New Year 2022 Whatsapp Status Messages, Wishes and Images
Sakshi News home page

Happy New year Whatsapp Status : వాట్సాప్‌ స్టేటస్‌లుగా బెస్ట్‌ గ్రీటింగ్స్‌.. ఫ్రెండ్స్‌, రిలేటివ్స్‌ను ఆకట్టుకోండి ఇలా

Dec 31 2021 4:32 PM | Updated on Dec 31 2021 6:19 PM

Happy New Year 2022 Whatsapp Status Images Download - Sakshi

కాలగమనంలో ఒక ఏడాది దొర్లిపోయింది. కొందరికి చేదు జ్ఞాపకాలు, మరికొందరికి మధురానుభూతుల్ని పంచింది 2021. ఇక ఎప్పటిలాగే కొత్త ఏడాదిలోకి గంపెడు ఆశలతో అడుగుపెడతాం. ఆ ఆశించడాన్ని నలుగురితో కలిసి పంచుకోవాలనుకుంటాం. అయినవాళ్లకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటాం.  అది మాటల్లోనే ఉండాలన్న గ్యారెంటీ లేదు కదా!.  


స్మార్ట్‌ లైఫ్‌లో విష్‌ చేసుకోవడానికి కూడా ఓ తరిఖా ఉంటోంది. సింపుల్‌గా ఒక్క ఫొటో చాలు. ఒకేసారి ఎంతో మందికి శుభాకాంక్షలు చెప్పినట్లే లెక్క! అందుకు వాట్సాప్‌ స్టేటస్‌ ఒక ప్లాట్‌ఫామ్‌గా ఉంటోంది. మరి మీరూ మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్నవాళ్లకి న్యూఇయర్‌ విషెస్‌ చెప్పాలనుకుంటున్నారా? అందుకోసం సాక్షి డాట్‌ కామ్‌ ప్రత్యేకంగా కొన్నింటిని మీకు అందిస్తోంది. 

Best WhatsApp Status For Happy New Year Wishes అందరూ మెచ్చే ఈ గ్రీటింగ్‌ ఫొటోలతో.. మీ వాట్సాప్‌ కాంటాక్ట్‌లోని వాళ్లందరికీ విషెస్‌ చెప్పేయండి. ఈ ఏడాది మొదటిరోజును సమ్‌థింగ్‌ స్పెషల్‌గా సెలబ్రేట్‌ చేసుకోండి.

ఈ కొత్త సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులకు సూర్యకాంతుల వంటి విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. కొత్త సంవత్సర శుభాకాంక్షలు

కొత్త సంవత్సరంలో సరికొత్త నిర్ణయాలు తీస్కోని విజయం సాధించాలని కోరుకుంటూ... విష్ యూ ఎ హ్యపీ న్యూ ఇయర్ 2022

మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలనెన్నో అందించాలని ఆశిస్తున్నా నూతన సంవత్సర శుభాకాంక్షలు

ప్రకృతిలో అందాన్ని..సున్నితమైన భావాన్ని..అందమైన మనస్సుని రాబోయె కొత్త సంవత్సరం లోనే కాకుండా, జీవితాంతం ఆస్వాదిస్తూ ఉండాలని కోరుకుంటూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement