దేశంలోనే తొలిసారి.. తనను తాను పెళ్లాడనున్న యువతి..

Gujarat Woman Set To Marry Herself Is In Indias First Sologamy - Sakshi

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. మరి అబ్బాయి, అమ్మాయిలకే పెళ్లిళ్లు నిశ్చయిస్తారా? అమ్మాయి, అమ్మాయి.. అబ్బాయి అబ్బాయి పెళ్లి చేసుకోవడం కూడా మచ్చుకు కొన్ని చూస్తూనే ఉన్నాం. జెండర్‌ ఏదైనా ఒకరికి ఒకరు తోడుగా ఉండటం కామన్‌ పాయింట్‌. అయితే ఇక్కడ ప్రస్తవించే పెళ్లి మాత్రం వీటన్నింటికి చాలా భిన్నం.. ప్రత్యేకం కూడా. ఓ యువతి తనకు వేరేకొరి తోడు లేకుండానే పెళ్లి చేసుకోబోతుంది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం.. గుజరాత్‌కు చెందిన ఓ యువతి తనను తానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.

వడోదరకు చెందిన 24 ఏళ్ల క్షమా బింధు స్వీయ పరిణాయమడనుంది. అయితే సాధారణ పెళ్లి లాగే అన్ని వేడకలను నిర్వహించాలనుకుంది. జూన్‌11న అన్ని ఆర్భాటాలతో పెళ్లి చేసుకోబోతుంది. ఒక్క వరుడు, బరాత్‌ తప్పా అన్నీ సంప్రదాయబద్దంగా జరుపుకోనుంది.  తన పెళ్లి గురించి క్షమా మాట్లాడుతూ.. తనెప్పుడూ ఎప్పుడూ పెళ్లి చేసుకోవాలనుకోవాలనుకోలేదని పేర్కొంది. అయితే పెళ్లికూతురు మాత్రం తయారు కావాలని అనుకున్నానని, అందుకే తనను తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది.

‘స్వీయ వివాహం అనేది మనకోసం మనం నిలబడాలనే నిబద్ధత..  నీపై నువ్వు ప్రేమను చూపించడం. కొందరు ఎవరినైనా ప్రేమిస్తే వారిని పెళ్లి చేసుకుంటారు. కానీ నన్ను నేను ప్రేమిస్తున్నాను. అందుకే స్వీయ వివాహం చేసుకుంటున్నాను. అంతేకాదు, ఇంతకు ముందు దేశంలో ఎవరైనా ఇలా చేశారా? అని ఆన్‌లైన్‌లో వేతికినా వివరాలు రాలేదు. బహుశా నేనే మొదటి వ్యక్తిని కావచ్చు. ఇలాంటి వివాహం అసందర్భమైందని అంటుంటారు కానీ, స‌మాజానికి స్త్రీలు ముఖ్యమని తెలియజేయడానికే ఈ ప్రయత్నం చేస్తున్నాను’ అని తెలిపింది. 
చదవండి: అధికారుల నిర్లక్ష్యం.. ప్రజలు ఆ గ్రామాన్నే ఖాళీ చేశారు!

ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న గోత్రిలోని ఓ గుడిలో పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపింది. తన పెళ్లికి తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నట్లు వెల్లడించింది. ఇవన్నీ కాదు కానీ పెళ్లి తర్వాత హనీమూన్‌ కూడా వెళ్లనుందట ఈ పెళ్లికూతురు.. సోలోగా రెండు వారాలు గోవాకు వెళ్తున్నట్లు  పేర్కొంది. అయితే ఇలాంటి వివాహం జరగడం గుజరాత్‌లోనే కాదు దేశంలోనే మొదటిసారి. ప్రస్తుతం ఈ పెళ్లి విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top