పొలిటికల్‌ ట్విస్ట్‌.. ఆ ఆటోవాలాకు డబ్బులిచ్చి ప్రలోభ పెట్టారు?

Gujarat auto driver Who Invite Kejriwal Not AAP Man Only BJP Man - Sakshi

గాంధీనగర్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు ప్రచారం ఊపందుకుంది. అధికార బీజేపీతో పాటు కొత్తగా అక్కడ పోటీ చేయాలని భావిస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా నిరవధిక ప్రచారంతో హోరెత్తిస్తోంది. ఈ తరుణంలో ఈమధ్య జరిగిన ఓ పరిణామం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. 

సెప్టెంబర్‌ 12వ తేదీన ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అహ్మదాబాద్‌లో జరిగిన ఓ మీటింగ్‌కు హాజరయ్యారు. అక్కడ ఓ ఆటోవాలా.. తాను కేజ్రీవాల్‌ అభిమానినని, తన ఇంటికి వచ్చి భోజనం చేయాలని కోరాడు. దీంతో అనుకున్నదే తడవుగా అతని ఆటోలోనే ఇంటికి వెళ్లి కుటుంబంతో కలిసి భోజనం చేసి వచ్చాడు కేజ్రీవాల్‌. మార్గం మధ్యలో గుజరాత్‌ పోలీసులు ఆటోను అడ్డగించడం, ఎలాగోలా ఆటోవాలా ఇంటికి చేరుకుని భోజనం చేసి ఆ కుటుంబంతో కాసేపు సరదాగా గడిపారు ఢిల్లీ సీఎం. అయితే.. 

ఈ ఎపిసోడ్‌లో ఇప్పుడొక ట్విస్ట్‌ వెలుగు చూసింది. ఆ ఆటోడ్రైవర్‌ బీజేపీ మనిషి అని, అన్నింటికన్నా ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని అనే విషయాన్ని వెల్లడించారు.  బీజేపీ స్టేట్‌ మీడియా హెడ్‌ జుబిన్‌ ఆష్రా ఈ మేరకు ఆ ఆటోడ్రైవర్‌తో ఉన్న ఓ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఆప్‌ నేతలు తనకు డబ్బు ఇచ్చిన విషయాన్ని స్వయంగా ఆ ఆటోడ్రైవర్‌ ఒప్పుకున్నాడు కూడా.  కేజ్రీవాల్‌ను తన ఇంటికి ఆహ్వానించిన అదే ఆటో డ్రైవర్‌ ఈ విక్రమ్‌ దంతాని. కానీ, ఇతగాడు చిన్నప్పటి నుంచి మోదీ అభిమాని. ఏదో డబ్బు ఆశతో ఆప్‌ వాళ్లు చెప్పినట్లు నటించాడు అని జుబిన్‌ ఒక వీడియోను రిలీజ్‌ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top