చాంతాడంతా చలానాలు పెండింగ్‌..మూడు రోజుల్లో రూ. 25 కోట్లు వసూళ్లు

Govt Providing Subsidy Within 3 Days Rs. 25 Crores Challans Payments  - Sakshi

సాక్షి, బనశంకరి: ఈనెల 11 లోపు ట్రాఫిక్‌ బకాయిలు చెల్లిస్తే 50 శాతం రాయితీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఊహించని విధంగా చెల్లింపులు జరుగుతున్నాయి. ఈనెల 3న రాయితీ అమల్లోకి రావడంతో మొదటి రోజే రూ. 5.61 కోట్లు, రెండో రోజు రూ. 6.80 కోట్లు, మూడో రోజు ఆదివారం రూ. 6.31 కోట్లకు పైగా వసూలైంది. సోమవారం కూడా భారీగా జరిమానాలు చెల్లించారు. సాయంత్రానికి మొత్తంగా రూ. 25 కోట్లు వసూలైంది.

నగరంలోని ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్లలోనే కాకుండా ఇన్‌ఫ్యాంట్రీ రోడ్డులోని ట్రాఫిక్‌ నిర్వహణ కేంద్రంలో కౌంటర్‌ తెరిచి జరిమానా చెల్లించడానికి అవకాశం కల్పించారు. హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవల ప్రాధికార అధ్యక్షుడు న్యాయమూర్తి బీ.వీరప్ప అధ్యక్షతన గత నెల 27న నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర రవాణాశాఖ అధికారులతో చర్చించి జరిమానా బకాయిలపై రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి రాష్ట్ర రవాణా రోడ్డు భద్రతా కమిషనర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు.

(చదవండి: వాట్సాప్‌తో ఫుడ్‌ ఆర్డర్‌ చేయొచ్చు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top