Gurugram: ఇదేం ట్రాఫిక్‌ జామ్‌రా బాబూ.. 7 కిలోమీటర్లకు 3 గంటల నరకయాతన | 7 km traffic jam on Gurugram highway | Sakshi
Sakshi News home page

Gurugram: ఇదేం ట్రాఫిక్‌ జామ్‌రా బాబూ.. 7 కిలోమీటర్లకు 3 గంటల నరకయాతన

Sep 2 2025 7:27 AM | Updated on Sep 2 2025 8:39 AM

7 km traffic jam on Gurugram highway

గురుగ్రామ్‌: ఉత్తరాదిన కురుస్తున్నవర్షాలు పలు విపత్తులను తీసుకువస్తున్నాయి. హర్యానాలోని గురుగ్రామ్‌లో భారీవర్షం కురిసిన దరిమిలా ఢిల్లీ-జైపూర్ హైవేపై  ఏడెనిమిది కిలోమీటర్ల  మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఆ దారిలోని ప్రయాణికులు మూడు గంటల పాటు నరకయాతన అనుభవించారు.  సాధారణ జనజీవనం స్తంభించిపోయింది.

రోడ్లన్నీ భారీగా జలమయం అయ్యాయి. నేడు(మంగళవారం) కూడా వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ అంచనాల నేపథ్యంలో వివిధ కార్యాలయాల ఉద్యోగులను ఇంటి నుండే పని చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.
 

‘సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు గురుగ్రామ్ నగరంలో 100 మి.మీకు మించి భారీ వర్షపాతం నమోదైంది. భారత వాతావరణ శాఖ తన అంచనాలతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది’ అని గురుగ్రామ్ జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది.

 

గురుగ్రామ్‌లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న దృష్ట్యా హర్యానా ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. వారంతా ప్రధాన కార్యాలయంలోనే ఉండి, సెప్టెంబర్ ఐదు వరకు వర్షాల కారణంగా ఎటువంటి ప్రమాదాలు వాటిల్లకుండా చూడాలని ఆదేశించింది.
 

హైవేపై భారీ ట్రాఫిక్ జామ్‌పై కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా స్పందిస్తూ ఇది బీజేపీకి చెందిన ట్రిపుల్ ఇంజిన్ మోడల్ ఆఫ్ మిలీనియం సిటీ అర్బన్ డెవలప్‌మెంట్’ అంటూ విమర్శలు గుప్పించారు. 

మరో కాంగ్రెస్ నేత గౌరవ్ పాంధి.. ట్రాఫిక్ జామ్  ఫోటోను షేర్‌ చేస్తూ, దీనిని ‘థర్డ్ క్లాస్ -నాన్‌నెస్స్‌’ అని అభివర్ణించారు. వరదలు తలెత్తిన వీధులతో, ముఖ్యంగా అండర్‌పాస్‌లు, లోతట్టు రోడ్లతో ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సెప్టెంబర్ ఐదు వరకు నగరంలో వర్షాలు కురుస్తాయని ప్రైవేట్ వాతావరణ సూచన సంస్థ స్కైమెట్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ పలావత్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement