ఎయిర్‌పోర్ట్‌లో షాకింగ్‌ ఘటన: ప్రయాణికులను ఎక్కించుకోవడం మర్చిపోయి..

Go First Flight Took Off 50 More Passengers Forget At Bengaluru - Sakshi

బెంగళూరు విమానాశ్రయంలో ఒక షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. సుమారు 50 మందికి పైగా ప్రయాణికులు ఎక్కకుండానే విమానం టేకాఫ్‌ అయ్యింది. ఈ విషయమై ఫిర్యాదులు అందడంతో సదరు ఎయిర్‌లైన్‌ని డీజీసీఏ వివరణ కోరింది. వివరాల్లోకెళ్తే.. సోమవారం ఉదయం 6.30 గంటలకు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గో ఫస్ట్‌ విమానం జి8116 ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. ఐతే నాలుగు బస్సుల్లో ప్రయాణికులను విమానంలోకి చేర్చారు.

ఇంకా సుమారు 55 మంది ప్రయాణికులు బస్సులోనే ఉండిపోయారు. విమానం వారిని ఎక్కించుకోకుండానే వెళ్లిపోయింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌ అధికారులు నాలుగంటలు తర్వాత అంటే ఉదయం 10 గంటలకు ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా ఎయిర్‌ ఇండియా విమానం ఏర్పాటు చేసి వారిని పంపించారు.

అయితే ఈ ఘటనపై ప్రయాణికులు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య, ప్రధాని నరేంద్రి మోదీ కార్యాలయాన్ని ట్యాగ్‌ చేస్తూ ట్విట్వర్‌లో ఫిర్యాదులు చేశారు. దీంతో రంగంలోకి దిగిగిన డీజీసీఏ దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని సదరు ఎయిర్‌లైన్‌ను  ఆదేశించింది.  కాగా  ప్రయాణికులకు  బోర్డింగ్‌పాస్‌లు ఉన్నాయని, తనిఖీలు నిమిత్తం నిరీక్షిస్తుండగా.. విమానం ప్రయాణకులను ఎక్కించుకోవడం మరిచి వెళ్లిపోయినట్లు సమాచారం.

ఈ మేరకు విమానం కోసం వేచి ఉన్న ప్రయాణికులు తమ అనుభవాన్ని ట్విట్టర్‌లో వివరిస్తూ.. బెంగళూరుకి చెందిన సుమిత్‌ కుమార్‌ అనే ప్రయాణికుడు ఈ ఆలస్యం కారణంగా సమావేశానికి హారుకాలేకపోయానని, గో ఫస్ట్‌లో ఇదే నా చివర ఫ్లైట్‌ జర్నీ అని వాపోయారు. మరో ప్రయాణికురాలు శ్రేయా సిన్హా ఇది అత్యంత భయానక అనుభవం అని, గంటల తరబడి బస్సులోనే ఉండిపోయాం అని ట్విట్‌ చేశారు. కాగా గోఫస్ట్‌ ఎయిర్‌వేస్‌ ఆయా ట్వీట్‌లకు స్పందిస్తూ..ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా అని ట్విట్టర్‌లో పేర్కొనడం గమనార్హం. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top