పాపం పాప.. విమానం గాల్లో ఉండగా.. 

Girl Deceased By Cardiac Arrest While On Go Air Flight - Sakshi

నాగ్‌పూర్‌ : గో ఏయిర్‌ విమానంలో ప్రయాణిస్తున్న ఓ బాలిక కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా మరణించింది. మంగళవారం లక్నో నుంచి ముంబై వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌, శేఖర్‌ ఖత్‌, సిద్దార్ద్‌ నగర్‌కు చెందిన ఆ​యుషి పున్వసి ప్రజాపతి అనే ఏడేళ్ల బాలిక అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమె  తండ్రి ముంబైలోని ఆసుపత్రికి తీసుకెళ్లటానికి గో ఏయిర్‌ విమానాన్ని ఎక్కారు. అయితే విమానం గాల్లో ఉండగా బాలిక కార్డియాక్‌ అరెస్ట్‌కు గురైంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ ద్వారా విమానాన్ని ఆపి బాలికను నాగ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ( ఆమెను చంపాలనుకోలేదు.. కల కన్నాను )

పాపను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. విమానం ఎత్తులో ఎగరటం కారణంగానే ఆయుషి కార్డియాక్‌ అరెస్ట్‌కు గురైనట్లు అభిప్రాయపడ్డారు. దీనిపై గో ఏయిర్‌ అధికారులు మాట్లాడుతూ.. ‘‘ పాప రక్తహీనతతో బాధపడుతోంది. తండ్రి ఆ విషయం మాకు చెప్పలేదు. చెప్పుంటే విమానం ఎక్కనిచ్చే వాళ్లం కాదు. 8-10గ్రాముల కంటే తక్కవ హిమోగ్లోబిన్‌ ఉన్న వాళ్లు విమానప్రయాణానికి అనర్హులు. ఆ పాపకు కేవలం 2.5 హిమోగ్లోబిన్‌ మాత్రమే ఉంది. దానికి చికిత్స చేయించుకోవటానికే వారు ముంబై వెళుతున్నారు’’ అని తెలిపారు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top