బిహార్‌లో నకిలీ పోలీస్‌ స్టేషన్‌.. 8 నెలలుగా వసూళ్ల పర్వం

A Gang In Bihar Operated A Fake Police Station From A Hotel - Sakshi

పాట్నా: నకిలీ వస్తువులు, కల్తీ ఆహారపదార్థాలు తయారు చేసే కేంద్రాలను పోలీసులు పట్టుకున్న సంఘటనలు చాలానే చూసుంటారు. కానీ, ఓ గ్యాంగ్‌ ఏకాంగా నకిలీ పోలీస్‌ స్టేషన్‌నే ఏర్పాటు చేసింది. పోలీసుల దుస్తుల్లో ఎనిమిది నెలలుగా వసూళ్లకు పాల్పడుతోంది. ఈ సంఘటన బిహార్‌లోని బాంగా జిల్లాలో వెలుగు చూసింది. అయితే, స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు కేవలం 500 మీటర్ల దూరంలోనే ఈ నకిలీ పోలీస్‌ స్టేషన్‌ ఉండటం గమనార్హం. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు భోలా యాదవ్‌ ఓ గెస్ట్‌ హౌస్‌లో నకిలీ పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశాడు. ముందుగా రూ.వేలు వసూలు చేసి అనిత, జూలీ అనే ఇద్దరు మహిళల్ని పోలీసులుగా నియమించుకున్నాడు. మరో ముగ్గురిని తన గ్యాంగ్‌లో చేర్చుకుని డీఎస్పీ, స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ లాంటి హోదాలు  కట్టబెట్టాడు. వారికి యూనిఫాంలతో పాటు నాటు తుపాకీలు ఇచ్చాడు. వారు చెకింగ్‌ల పేరుతో భయపెట్టి ప్రజల నుంచి డబ్బులు వసూళు చేసేవారు. 

బుధవారం సాయంత్రం టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన శంభు యాదవ్‌ నాటు తుపాకులతో ఉన్న నకిలీ పోలీసులను చూశారు. అతడికి అనుమానం వచ్చి ఆరా తీయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నకిలీ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేసిన ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: బాయ్‌ఫ్రెండ్‌ని మార్చినంత ఈజీ అతనికి పార్టీలు మార్చడం!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top