
న్యూఢిల్లీ: నలుగురు గాంధీలు.. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వరుణ్ గాంధీ, మేనకా గాంధీ.. వీరంతా ఒక విషయంలో ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలా నలుగురూ ఒకే మాటకు కట్టుబడి ఉండటమనేది అరుదుగా జరిగింది. ఇంతకీ ఆ నలుగురు గాంధీలు ఏ విషయంలో ఏకతాటిపైకి వచ్చారు?
రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో వీధి కుక్కలను తొలగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, వరుణ్ గాంధీ, మేనకా గాంధీలు వ్యతిరేకించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ తరహా సుప్రీం ఆదేశాన్ని దశాబ్దాల మానవీయ విధానం నుండి వెనక్కి తగ్గడమని అభివర్ణించారు. రాహుల్ తన ‘ఎక్స్’ పోస్టులో సుప్రీం కోర్టు నిర్ణయం మనలోని కరుణను తొలగిస్తుందని పేర్కొన్నారు. షెల్టర్లు, స్టెరిలైజేషన్, టీకాలు వేయడం మొదలైన చర్యలు వీధి శునకాలను సురక్షితంగా ఉంచగలవన్నారు. ఇదే అంశంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ, ఢిల్లీ నగరంలోని అన్ని వీధి కుక్కలను వారాల వ్యవధిలో ఆశ్రయాలకు తరలించడ మనేది అమానవీయ ప్రవర్తనకు దారితీస్తుంది. వాటిని ఉంచేందుకు తగినన్ని ఆశ్రయాలు కూడా లేవన్నారు.
First time in my life, I’m not just sharing his post, I’m fully supporting him on this issue. ❤️
.@RahulGandhi Ji, thank you for standing up for these innocent dogs. ❤️🙏 pic.twitter.com/0VedWX6uNQ— Gyan Jara Hatke (@GyanJaraHatke) August 12, 2025
బీజేపీ మాజీ ఎంపి వరుణ్ గాంధీ ఇదే అంశంపై మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాన్ని క్రూరత్వాన్ని సంస్థాగతీకరించడంతో పోల్చారు. తమను తాము రక్షించుకోలేని వాటిని(కుక్కలను) శిక్షించడానికి చట్టపరంగా చేసి సూచన అని అన్నారు. వీధి ఆవులు, కుక్కలను తరలిస్తే, ప్రభుత్వం నుంచి సానుభూతి నుండి వైదొలిగినట్లేనని, అలాంటప్పుడు తీవ్ర నైతిక సంక్షోభాలు ఎదురవుతాయని వరుణ్ గాంధీ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. మాజీ కేంద్ర మంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ ఈ ఉత్తర్వులను ఆచరణీయం కాదన్నారు. ఇది పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.