మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డికి పాజిటివ్‌ | gali janardhan Reddy tests Covid-19 positive | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి కరోనా పాజిటివ్‌

Aug 30 2020 9:27 PM | Updated on Aug 30 2020 9:31 PM

gali janardhan Reddy tests Covid-19 positive - Sakshi

సాక్షి, బెంగళూరు : క‌ర్ణాట‌క‌ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి (53) క‌రోనా వైరస్‌ బారిన పడ్డారు. ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఆదివారం వచ్చిన ఫలితాల్లో కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్యులు నిర్దారించారు. తనకు కరోనా లక్షణాలు ఏమాత్రం లేవని వైద్యుల సలహామేరకు చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న తన మిత్రులు, అభిమానులకు గాలి జనార్దన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఓబులాపురం మైనింగ్ కుంభకోణంలో 2015 నుంచి.. షరతులతో కూడిన బెయిల్ మీదున్నారు. ఆదివారం బళ్లారిలో కర్ణాటక ఆరోగ్య మంత్రి బీ శ్రీరాములు తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సుప్రీం కోర్టు నుంచి రెండు రోజుల పాటు అనుమతి తీసుకున్నారు. కోవిడ్ సోక‌డంతో ఆసుపత్రిలో చేరడం వల్ల అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నాని సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement