శివకాశీలో భారీ పేలుళ్లు.. 10 మంది మృతి | Sakshi
Sakshi News home page

శివకాశీలో భారీ పేలుళ్లు.. 10 మంది మృతి

Published Tue, Oct 17 2023 5:07 PM

Explosion At Fireworks Centres In Sivakasi - Sakshi

సాక్షి, తమిళనాడు: విరుదునగర్ జిల్లా శివకాశీలోని రెండు బాణా సంచా తయారీ కేంద్రాల్లో వరుస భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటలో 10 మంది కార్మికులు మృతి చెందగా, 9 మంది పరిస్థితి విషయంగా ఉంది.

గ్రామ శివార్లలో ఉన్న ఒక బాణా సంచా తయారీ కేంద్రం, దానికి ఆనుకుని ఉన్న బాణాసంచా విక్రయ కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం ఈ అగ్నిప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

శివకాశీ సమీపంలోని రెంగపాలయంలో ఒక బాణా సంచా తయారీ కేంద్రం నడుస్తోంది. ఆ కేంద్రానికి ముందు వైపు ఉన్న షాపులో బాణాసంచా అమ్మకాలు జరుపుతారు. దీపావళి పండుగ దగ్గర పడుతుండడంతో భారీగా బాణా సంచాను నిల్వ చేశారు.

మంగళవారం మధ్యాహ్నం ఆ షాపులో బాణాసంచా కొనుగోలు చేసిన కొందరు ఆ షాపు ముందే వాటిని కాల్చడంతో ఒక క్రాకర్ మండుతూ ఆ షాపులోకి దూసుకువెళ్లింది. దీంతో మంటలు వ్యాపించి భారీ పేలుళ్లు సంభవించాయి.
చదవండి: ప్రవళిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement