14 ఏళ్ల జైలు శిక్ష.. కథలో కొస మెరుపు తెలుసా?

EX Army Man Acquitted Before He Release From Jail Of 14 Year - Sakshi

భోపాల్‌ : చేయని తప్పుకు 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు ఓ మాజీ ఆర్మీ ఉద్యోగి.  విడుదలకు సిద్ధంగా ఉన్న 11 రోజుల ముందు అతడు నిర్ధోషని తేలటం కథలో కొస మెరుపు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మొరెనా జిల్లా భర్రద్‌కు చెందిన బల్వీర్‌సింగ్‌ యాదవ్‌ అనే మాజీ ఆర్మీ ఉద్యోగి 2006లో ఓ మర్డర్‌ కేసులో కొందరు స్నేహితులతో పాటు అరెస్టయ్యారు. ఆయనకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ జనవరిలో శిక్ష కాలం పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ హైకోర్టు మర్డర్‌ కేసులో బల్వీర్‌సింగ్‌ను నిర్థోషిగా తేల్చింది. విడుదలకు 11 రోజుల మందు ఈ తీర్పు రావటం గమనార్హం.

దీనిపై బల్వీర్‌ మాట్లాడుతూ.. ‘‘ నేను చివరిసారిగా సురేంద్ర యాదవ్‌(హతుడు)ను చూసినందుకు నన్ను నిందితుడిగా చేర్చారు. మధ్యప్రదేశ్‌ హైకోర్టు తాజాగా నన్ను నిర్ధోషిగా తేల్చినందుకు సంతోషంగా ఉంది. కానీ, నేను నా జాబ్‌ను, గౌరవాన్ని, విలువైన 14 సంవత్సరాల కాలాన్ని పోగొట్టుకున్నాను. అయినప్పటికి న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం పెరిగింది. న్యాయవ్యవస్థ ఏదైనా తీర్పు ఇ‍వ్వటానికి కచ్చితమైన గడువు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకంటే నేను చేయని తప్పుకు శిక్ష అనుభవించటం చాలా కష్టంగా ఉండింది’’ అని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top