
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 57 స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికల షెడ్యూల్‌ను సరైన సమయం చూసి ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి శుక్రవారం వెల్లడించారు. 56 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా మహమ్మారి, కొన్ని రాష్ట్రాల్లో వరద బీభత్సం కారణంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేవని ఆ అధికారి చెప్పారు.
ఎనిమిది స్థానాలకు జరగాల్సిన ఉప ఎన్నికల గడువు తేదీ సెప్టెంబర్ 7 నాటికి ముగుస్తుంది. మిగిలిన 49 స్థానాలకు సెప్టెంబర్ తర్వాత వరకు ఉంది. శుక్రవారం ఈ అంశంపై సమీక్షించిన ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను సరైన సమయంలో ప్రకటిస్తామని స్పష్టం చేసింది. బిహార్‌లో ఒక లోక్‌సభతో పాటు మధ్యప్రదేశ్‌లో 27 స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది.