Thick-skinned Baby: ఆ చిన్నారి బరువుని చూసి డాక్టర్లే ఆశ్యర్యపోతున్నారు!..రక్త పరీక్షలు కూడా నిర్వహించలేరట !

Eight Month Old Baby Weight 17 Kgs And Have Thick Skinned - Sakshi

An eight-month-old baby from Punjab: మనం ఇంతవరకు ఎన్నో రకాల వింత జననాలు గురించి విన్నాం. పైగా అలాంటి పిల్లలకి వైద్యులు ఎంతో కొంత చికిత్స అందించి కాపాడే ప్రయత్నాలు కూడా చేసిన ఘటనలు చూశాం. కానీ పంజాబ్‌కి చెందిన చిన్నారి అధిక బరువు సమస్యతో బాధపడుతుంది. అయితే ఇది ఈ రోజుల్లో సర్వసాధారణమే కదా ఇదేమీ అంత పెద్ద సమస్య కాదనుకోకండి. ఎందుకంటే ఆమెకు చికిత్స అందించడం కూడా కష్టమే. అందుకు ఆమె శరీరం తీరే కారణమట.

పంజాబ్‌కు చెందిన చాహత్ కుమార్ అనే ఎనిమిది నెలల పాప నాలుగేళ్ల పాప ఉండేంత బరువు(17 కేజీలు) ఉంటందట. పైగా ఆ చిన్నారి తల్లి పుట్టిన నాలుగు నెలల నుంచి అసాధారణంగా బరువు పెరగడం ప్రారంభమైంది. దీంతో ఆమె తల్లిదండ్రలు సూరజ్ కుమార్, రీనా చాలా ఆందోళన చెందారు. అంతేకాదు డాక్టర్లు సైతం ఆ చిట్టితల్లి బరువుని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఆ పాప తల్లి మొదటి ప్రసవంలో కొడుకుని కోల్పోయింది.

దీంతో ఆమె ప్రస్తుతం తాను ఈ కుమార్తెను కూడా కోల్పోతానేమో అనే భయంతో గడుపుతోంది. అయితే ఆ పాపకు విపరీతమైన ఆకలి కారణంగా పెద్ద పిల్లలు తినే విధంగానే అన్ని తింటుందని తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు. పైగా ఆమెను ఎత్తుకోవడం కూడా కష్టమని చెబుతున్నారు. ఆ పాప అసాధారణ బరువుతో ఊబకాయంతో బాధపడటమే కాక ఆమె శరీరంతో కూడా సమస్యలు ఎదుర్కొంటుంది. అయితే ఆమె శరీరం అత్యంత దళసరిగా ఉంటుంది. ఈ మేరకు వైద్యుడు వాసుదేవ్ శర్మ ఆమె శరీరం అత్యంత దృఢమైనదని, రక్తపరీక్షలు నిర్వహించడం అసాధ్యం అని చెబుతున్నారు. ఆయన ఎన్నోసార్లు పరీక్షలు నిర్వహించిన విఫలమైనట్లు చెప్పారు. పాపం తల్లితండ్రులు మాత్రం తమ పాప సాధారణ స్టితికి రావాలని, అందరి పిల్లల్లా ఆడుకుంటూ హాయిగా జీవించాలని ఆశిస్తున్నారు. అయితే ఈ ఘటన రెండేళ్ల కిందట జరిగినప్పటికి ఇప్పటి ఈ విషయం ఆసక్తికరంగా నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

(చదవండి: ఔను.. దెయ్యాలు ఉన్నాయి’: ఐఐటీ ప్రొఫెసర్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top