కోల్‌కతా: టీఎంసీ ఎంపీ మహూవా మెయిత్రాపై కోడిగుడ్ల దాడి జరిగింది. ఈ రోజు ( బుధవారం) కోల్‌కతాలోని తన ఆఫీసువద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై కోడిగుడ్లతో దాడి చేశారు. అయితే బీజేపీ మద్ధతుదారులే తనపై దాడి చేశారని మహూవా ఆరోపిస్తుంది. ఈ దాడికి సంబంధించిన వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.
ఈరోజు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పశ్చిమ బెంగాల్‌లో పార్టీ కార్యకర్తలతో సమావేశంలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ దుకాణం వద్ద టీఎంసీ కార్యకర్తలతో మాట్లాడుతున్న ఆమెపై కొందరు కోడిగుడ్లతో చేశారు. తనపై దాడి జరిగిన విషయాన్ని ఆమె అధికారింకంగా ధ్రువీకరించారు. బీజేపీ కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారని . ఇది బెంగాల్ పోలీసుల ఫెయిల్యూర్ అని పేర్కొన్నారు. మహువా మొయిత్రా ఆరోపణలపై బీజేపీ ఇంకా స్పందించలేదు.
కాగా పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల తర్వాత తృణముల్ నేతలపై దాడులు తీవ్రతరమయ్యాయి. ఇటీవల ఓ పర్యటనలో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. ఈ ఘటన మరువక ముందే తాజాగా మరోసారి ఎంపీ మహూవాపై గుడ్లదాడి జరగడం తీవ్ర కలకలం రేపుతుంది.
Mahua aunty ke yahan bhi pahunch gaye eggs, Her source of energy 😭😭🤣 pic.twitter.com/ySt2rsMnMs
— Lala (@lala_the_don) July 1, 2026


