పోస్ట్​ కోవిడ్​ కాంప్లికేష​​న్స్​​: ఎయిమ్స్​లో చేరిన కేంద్ర మంత్రి

Education Minister Ramesh Pokhriyal Admitted To AIIMS With Post Covid Complications - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి సామాన్యుల నుంచి వీఐపీల వరకు ఏ ఒక్కరిని వదలడం లేదు. ఇప్పటికే ఈ వైరస్​ బారిన పడిన వారిలో చాలా మంది ఆసుపత్రులలో చేరుతున్నారు. అయితే, కరోనా సోకిన తర్వాత ఆక్సిజన్​ లెవల్స్​ పడిపోవడం, రుచి తెలియక పోవడం, ఊపిరితిత్తులు ఇన్​ఫెక్షన్​కు గురవ్వడం మొదలైన లక్షణాలు ఉంటాయన్న విషయం మనకు తెలిసిందే.

అయితే, ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో సరైన చికిత్స తీసుకొన్న కూడా  కోవిడ్​ నెగెటివ్​ అనంతరం కూడా అనేక శారీరక సమస్యలు కొత్తగా ఉత్పన్న మవుతున్నాయి.  వీటిని పోస్ట్​ కోవిడ్​ సమస్యలుగా పేర్కొంటారు. తాజాగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్​ పోఖ్రియల్​ ​నిశాంక్ కోవిడ్​ అనంతరం సమస్యలతో ఢిల్లీలోని ఆల్​ ఇండియా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​ (ఎయిమ్స్​) ఆసుపత్రిలో చేరారు.

కాగా, 61 ఏళ్ల వయస్సున్న పోఖ్రియల్​ నిశాంక్​ గత ఏప్రిల్​ 21 న కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత డాక్టర్ల పర్యవేక్షణలో సరైన మందులు, డైట్​ పాటించడం జరిగింది. ఈ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఆయన కోవిడ్​ నుంచి కోలుకున్నారు. అప్పటి నుంచి ఆన్​లైన్​లో  విద్యా శాఖ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కొత్తగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే డాక్టర్ల సూచన మేరకు ఆయన ఎయిమ్స్​లో చేరారు. అయితే, ఇప్పటికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.   

ఇదిలా వుండగా కేంద్ర విద్యాశాఖ గత కొన్ని రోజులుగా  సిబిఎస్​ఇ పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకొలేదు. ఈ క్రమంలో సుప్రీం కోర్ట్​ వెంటనే సిబిఎస్​ఇ పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అయితే, ప్రస్తుతం కేంద్ర మంత్రి రమేష్​ పోఖ్రియల్​ ఆసుపత్రిలో ఉన్న తరుణంలో,  సిబిఎస్​ఇ పరీక్షలపై సరైన నిర్ణయం తీసుకోవడానికి మరో రెండు రోజుల సమయం కావాలని కేంద్ర విద్యాశాఖ సుప్రీం కోర్టును కోరింది. 

చదవండి: ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం.. నల్లగా మారిన మహిళ చేయి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top