
న్యూఢిల్లీ/ముంబై: మనీ లాండరింగ్ కేసులో శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న ముంబైలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వాస్తవానికి సంజయ్ రౌత్ బుధవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఈడీ ఎదుటకు రాలేదు.
ఆగస్టు మొదటి వారం వరకూ సమయం ఇవ్వాలని కోరుతూ సంజయ్ రౌత్ తన లాయర్ల ద్వారా ఈడీకి ఒక లేఖ పంపించారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటున్నానని, ఈడీ ఎదుటకు రాలేనని పేర్కొన్నారు. దీంతో ఈడీ ఆయనకు కొంత ఉపశమనం కలిగించింది. 27న హాజరు కావాలంటూ మరోసారి సమన్లు జారీ చేసింది.