వరుసగా 7 రోజులు ‘తాగితే’ మద్యం అలవాటుగా మారిపోతుందా?

Drinks Alcohol for 7 Days will he get Addicted - Sakshi

మద్యం, జూదం అనేవి వ్యసనాలని, ఇవి ఎవరికైనా ఒకసారి అలవడితే వారు వాటిని జీవితంలో విడిచిపెట్టలేరని చాలామంది అంటుంటారు. ఇవి వ్యవసంగా మారితే వారి జీవితాలను ఎవరూ బాగుచేయలేని కూడా చెబుతుంటారు. మనిషికి మద్యం ఎలా అలవడుతుంది? ఏ మేరకు మద్యం తాగితే అది అలవాటుగా మారిపోతుంది. కొందరు చెబుతున్నట్లు వరుసగా 7 రోజులు మద్యం తాగితే అది అలవాటుగా మారిపోతుందా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మద్యం అలవాటు అనేది ఒక క్రానిక్‌ డిసీజ్‌. మద్యం అలవాటు అనేది మూడు దశలుగా ఏర్పడుతుంది. మొదటి దశలో మద్యం తాగేవారు అది వారికి తెలియకుండానే అలవాటుగా మారిపోతుందని గ్రహించలేరు. ఈ దశలో మద్యం తాగే వ్యక్తి దానిని అధికమోతాదులో తీసుకుంటాడు. మద్యం తాగడంపై నియంత్రణ కోల్పోతాడు. ఇక్కడి నుంచే అతను తప్పు చేయడం మొదలుపెడతాడు. ఇక వరుసగా 7 రోజులు మద్యం తాగితే అది అలవాటుగా మారిపోతుందా అనే విషయానికి వస్తే దీనికి స్పష్టమైన రుజువులు లభ్యం కాలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే వరుసగా ఏడు రోజుల పాటు మద్యం తాగితే, అలాగే అది అధిక మోతాదులో ఉంటే తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. 

ఇక మద్యం తాగడంలోని రెండవ దశ విషయానికొస్తే ఆ సమయంలో శరీరంలో అంతర్గతంగా మార్పులు వస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ దశలో సమాజంలోని తోటివారు మద్యం తాగేవారిని అవహేళన చేయడం కనిపిస్తుంది. ఇక చివరిదశ విషయానికొస్తే మద్యం తాగేవారు పూర్తిగా తమపై నియంత్రణ కోల్పోతారు. అదే సమయంలో శరీరాన్ని పలు వ్యాధులు చుట్టుముడతాయి. ఏ పనీ సరిగా చేయలేని స్థితికి చేరుకుంటాడు. శరీరం బలహీనమవుతుంది. 
ఇది కూడా చదవండి: నిండు గర్భిణిని నేరస్తురాలిని చేసిన ఏఐ.. మున్ముందు ఎన్ని ఘోరాలు చూడాలో?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top