హైదరాబాద్‌ డీఆర్డీఎల్‌ ఉద్యోగిపై పాక్ హ‌నీ ట్రాప్.. నటాషా నషాలో మిస్సైల్‌ వివరాలు మొత్తం..!

DRDL Employee Honey Trapped Mallikarjuna Reddy Via Pak Natasha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కంచన్‌బాగ్‌ డీఆర్డీఎల్‌ ఇంజినీర్‌ హానీ ట్రాప్‌ కేసులో కీలకాంశాలు వెలుగు చూస్తున్నాయి. డీఆర్డీఎల్‌లో క్వాలిటీ ఇంజినీర్‌(కాంట్రాక్ట్‌) మల్లికార్జునరెడ్డి అలియాస్‌ అర్జున్‌ బిట్టును ట్రాప్‌ చేశారు. ఇప్పటికే మల్లికార్జున్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన రాచకొండ పోలీసులు.. ఈ వ్యవహారంలో సంచలన విషయాలను సేకరించారు. ముఖ్యంగా..  కే-సిరీస్‌ మిస్సైల్‌కు చెందిన కీలక సమాచారాన్ని నటాషా పేరుతో ఉన్న ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌కు చేరవేశాడు మల్లికార్జున్‌రెడ్డి. 

ఇక యూకే అనుబంధ డిఫెన్స్‌ జర్నలిస్ట్‌ పేరుతో నటాషా రావుగా ట్రాప్‌ చేసినట్లు తేలింది. రెండు సంవత్సరాలుగా నటాషాతో మల్లికార్జున్‌ సంభాషణ కొనసాగింది. 2019-2021 వరకు నటాషాకు మిస్సైల్‌ కాంపోనెంట్స్‌ కీలక డేటా చేరవేశాడు. ఈ క్రమంలో సబ్‌మెరైన్‌ నుంచి మిస్సైల్‌ లాంచ్‌ చేసే కీలక కే-సిరీస్‌ కోడ్‌ను పాకిస్తానీ స్పైకు చేరవేసినట్లు తేలింది. నటాషా రావు అలియాస్‌ సిమ్రాన్‌ చోప్రా అలియాస్‌ ఒమిషా అడ్డి పేరుతో ఫేస్‌బుక్‌ ప్రొఫైల్స్‌ మెయింటెన్‌ చేశాడు పాకిస్తానీ.

ఇదిలా ఉంటే.. ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ ద్వారా మల్లికార్జున్‌కు మెసేలు. మల్లికార్జున్‌ ఫొటోలు, వీడియోలు అడిగినా నటాషా పంపలేదు. కేవలం చాటింగ్‌తోనే మల్లికార్జున్‌ను ట్రాప్‌ చేసింది నటాషా. మల్లికార్జున్‌ ల్యాప్‌టాప్‌, మొబైల్‌లో మిస్సైల్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మొబైల్‌లో ఇంగ్లీష్‌, హిందీలో ఉన్న నటాషా వాయిస్‌ రికార్డింగ్‌లు సైతం స్వాధీనం చేసుకున్నారు. మల్లికార్జునరెడ్డిని కస్టడీకి తీసుకోవాలనే యోచనలో ఉన్నారు పోలీసులు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top