breaking news
defence research development laboratory
-
హైదరాబాద్: డీఆర్డీఎల్ హానీ ట్రాప్.. సంచలన విషయాలు వెలుగులోకి!
సాక్షి, హైదరాబాద్: కంచన్‌బాగ్ డీఆర్డీఎల్ ఇంజినీర్ హానీ ట్రాప్ కేసులో కీలకాంశాలు వెలుగు చూస్తున్నాయి. డీఆర్డీఎల్లో క్వాలిటీ ఇంజినీర్(కాంట్రాక్ట్) మల్లికార్జునరెడ్డి అలియాస్ అర్జున్ బిట్టును ట్రాప్ చేశారు. ఇప్పటికే మల్లికార్జున్‌రెడ్డిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు.. ఈ వ్యవహారంలో సంచలన విషయాలను సేకరించారు. ముఖ్యంగా.. కే-సిరీస్ మిస్సైల్‌కు చెందిన కీలక సమాచారాన్ని నటాషా పేరుతో ఉన్న ఫేస్బుక్ ప్రొఫైల్‌కు చేరవేశాడు మల్లికార్జున్‌రెడ్డి. ఇక యూకే అనుబంధ డిఫెన్స్ జర్నలిస్ట్ పేరుతో నటాషా రావుగా ట్రాప్ చేసినట్లు తేలింది. రెండు సంవత్సరాలుగా నటాషాతో మల్లికార్జున్ సంభాషణ కొనసాగింది. 2019-2021 వరకు నటాషాకు మిస్సైల్ కాంపోనెంట్స్ కీలక డేటా చేరవేశాడు. ఈ క్రమంలో సబ్‌మెరైన్ నుంచి మిస్సైల్ లాంచ్ చేసే కీలక కే-సిరీస్ కోడ్‌ను పాకిస్తానీ స్పైకు చేరవేసినట్లు తేలింది. నటాషా రావు అలియాస్ సిమ్రాన్ చోప్రా అలియాస్ ఒమిషా అడ్డి పేరుతో ఫేస్బుక్ ప్రొఫైల్స్ మెయింటెన్ చేశాడు పాకిస్తానీ. ఇదిలా ఉంటే.. ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా మల్లికార్జున్‌కు మెసేలు. మల్లికార్జున్ ఫొటోలు, వీడియోలు అడిగినా నటాషా పంపలేదు. కేవలం చాటింగ్‌తోనే మల్లికార్జున్‌ను ట్రాప్ చేసింది నటాషా. మల్లికార్జున్ ల్యాప్‌టాప్, మొబైల్లో మిస్సైల్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే మొబైల్లో ఇంగ్లీష్, హిందీలో ఉన్న నటాషా వాయిస్ రికార్డింగ్‌లు సైతం స్వాధీనం చేసుకున్నారు. మల్లికార్జునరెడ్డిని కస్టడీకి తీసుకోవాలనే యోచనలో ఉన్నారు పోలీసులు. -
భారత అమ్ముల పొదికి ఆకాశ్
న్యూఢిల్లీ: దాదాపు 32 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతోంది. ఎప్పుడెప్పుడా అనుకుంటున్న భారత సైనికుల కల నెరవేరబోతుంది. భారతఅమ్ముల పొదిలోకి మరో శక్తిమంతమై క్షిఫణి ఆకాశ్ మంగళవారం అధికారికంగా చేరనుంది. ఇందుకోసం ఢిల్లీలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఆకాశ్‌ను భారత సైన్యానికి అప్పగించనున్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ ఆకాశ్ క్షిపణి దేశానికే గర్వకారణం. శత్రుసైన్యం విమానాలను దీటుగా ఎదుర్కొనేందుకు భారతీయశాస్త్రవేత్తలు దీన్ని రూపొందించారు. హైదరాబాద్‌లోని డిఫెన్స్ రిసెర్చ్ అండ్ లేబోరేటరీ (డీఆర్డీఎల్)లో పనిచేస్తున్న ఆకాశ్‌క్షిపణి ప్రాజెక్టు డెరైక్టర్ గడ్డమణుగు చంద్రమౌళి ఆధ్వర్యంలో దీన్ని రూపొందించారు. ఆకాశ్ క్షిపణి ప్రత్యేకతలు ఆకాశంలో ఎగిరే శత్రు విమానాలు, పెలైట్ రహిత విమానాలను ఛేదించేందుకు ఆకాశ్ క్షిపణి వ్యవస్థ పనిచేస్తుంది. ఒకేసారి నాలుగు విమానాలను, నాలుగు సూపర్సోనిక్ క్షిపణులతో ఛేదించడం దీని ప్రత్యేకత. ఈ వ్యవస్థను పూర్తిఆటోమేటిక్గా గానీ, సెమీ ఆటోమేటిక్‌గా గానీ ప్రయోగించవచ్చు. ప్రపంచంలో ఇటువంటి సామర్థ్యం అమెరికా, రష్యా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్ దేశాలకు మాత్రమే ఉంది. మన ఆకాశ్ క్షిపణి వ్యవస్థ ప్రపంచంలోని దేశాలన్నింటికంటే ముందుంది. మన క్షిపణికున్న ప్రత్యేక ఫీచర్స్ ఇతర దేశాలకు లేవు. ప్రపంచంలోనే అతితక్కువ ఖర్చుతో ఒక విమానాన్ని ఛేదించగల సామర్థ్యం. దీనినే లో కాస్ట్పర్ కిల్ అంటారు. విన్యాసాలు చేస్తూ వేగంగా కదిలే విమానాలను సైతం ఆకాశ్ ఛేదిస్తుంది. దీనికి సంబంధించిన అతిముఖ్యమైన రాడార్లను బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఎల్ఆర్డీఈ)ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. సూక్ష్మంగా ఉండే లక్ష్యాలను గుర్తించడం, అతివేగంగా పయనించే 64 లక్ష్యాలను ఒకేసారి ట్రాక్ చేయడం, ఒకేసారి ఎనిమిది క్షిపణులను గైడ్ చేయడం, శత్రు, మిత్ర విమానాలను గుర్తించడం, అత్యాధునిక ఎలక్ట్రానిక్ కౌంటర్ మెస్యూరింగ్ (ఈసీసీఎం) ఫీచర్స్‌తో ఈ రాడార్‌ను రూపొందించారు.