బిహార్‌లో నివసిస్తున్న ట్రంప్‌ !!  | Donald Trump fake residential certificate surfaces in Bihar | Sakshi
Sakshi News home page

బిహార్‌లో నివసిస్తున్న ట్రంప్‌ !! 

Aug 7 2025 6:05 AM | Updated on Aug 7 2025 6:05 AM

Donald Trump fake residential certificate surfaces in Bihar

సమస్తీపూర్‌: కుక్కలకూ నివాస ధృవీకరణ పత్రాలను జారీచేస్తున్న బిహార్‌ స్థానిక యంత్రాంగం ఈసారి వినూత్నంగా ట్రంప్‌కు  రెసిడెన్సీ సర్టీఫికేట్‌ ఇస్తారని ఓ ఆకతాయి భావించాడు. అనుకున్నదే తడవుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు రెసిడెన్సీ సర్టీఫికేట్‌ కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు చేశాడు. 

ఇప్పటికే బిహార్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌)తో బిజీగా ఉన్న అధికారుల కంట్లో ఈ దరఖాస్తు పడింది. హసన్‌పూర్‌లో ట్రంప్‌ నివసిస్తున్నట్లుగా ఈ అప్లికేషన్‌లో పేర్కొనడం చూసిన అధికారులు హుతాశులయ్యారు. వెంటనే తేరుకుని ఆ దరఖాస్తును ఆగస్ట్‌ నాలుగో తేదీన బుట్టదాఖలు చేశారు. జులై 29వ తేదీన ఈ దరఖాస్తు వచ్చింది. ట్రంప్‌ తండ్రి పేరు ఫ్రెడరిక్‌ క్రిస్ట్‌ అని, తల్లి మేరీ మెక్‌లాయిడ్‌ అని నిజమైన పేర్లనే పేర్కొనడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement