breaking news
residence certificates
-
బిహార్‌లో నివసిస్తున్న ట్రంప్ !!
సమస్తీపూర్: కుక్కలకూ నివాస ధృవీకరణ పత్రాలను జారీచేస్తున్న బిహార్ స్థానిక యంత్రాంగం ఈసారి వినూత్నంగా ట్రంప్‌కు రెసిడెన్సీ సర్టీఫికేట్ ఇస్తారని ఓ ఆకతాయి భావించాడు. అనుకున్నదే తడవుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు రెసిడెన్సీ సర్టీఫికేట్ కోసం ఆన్లైన్ దరఖాస్తు చేశాడు. ఇప్పటికే బిహార్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)తో బిజీగా ఉన్న అధికారుల కంట్లో ఈ దరఖాస్తు పడింది. హసన్‌పూర్‌లో ట్రంప్ నివసిస్తున్నట్లుగా ఈ అప్లికేషన్లో పేర్కొనడం చూసిన అధికారులు హుతాశులయ్యారు. వెంటనే తేరుకుని ఆ దరఖాస్తును ఆగస్ట్ నాలుగో తేదీన బుట్టదాఖలు చేశారు. జులై 29వ తేదీన ఈ దరఖాస్తు వచ్చింది. ట్రంప్ తండ్రి పేరు ఫ్రెడరిక్ క్రిస్ట్ అని, తల్లి మేరీ మెక్లాయిడ్ అని నిజమైన పేర్లనే పేర్కొనడం విశేషం. -
మొన్న ‘డాగ్ బాబు’ ఇప్పుడు ‘డాగేశ్’
పట్నా: బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ మొత్తంగా ప్రభుత్వ వ్యవస్థలకే తలనొప్పిగా మారింది. రెవెన్యూ వ్యవస్థలో లోపాలను తనిఖీ చేయాలనుకున్నారో ఏమో తెలియదు! ఓ వ్యక్తి మరో శునకానికి నివాస ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశారు. ఇటీవలే ‘డాగ్ బాబు’పేరుతో ఓ శునకానికి రెసిడెన్స్ సర్టీఫికెట్ జారీచేయడం, దీంతో సంబంధిత విభాగంపై విమర్శలు వెల్లువెత్తడం తెల్సిందే. అయితే తాజాగా అదే బిహార్‌లోని నవాడా జిల్లాలో ఉన్న సిర్దాల బ్లాక్‌లో ‘డాగేశ్ బాబు’పేరుతో మరో దరఖాస్తు ఆర్టీపీఎస్ కార్యాలయానికి చేరింది. అందులో దరఖాస్తుదారు కాలమ్‌లో కుక్క ఫొటోను చూసి అధికారులు అవాక్కయ్యారు. ఈ విషయం ఏకంగా నవాడా జిల్లా కలెక్టర్ రవి ప్రకాశ్ దృష్టికి వెళ్లింది. రాష్ట్రంలో మరో కుక్కకు స్థానిక నివాస దృవీకరణ పత్రం కావాలని అభ్యర్థన రావడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు ఈ దరఖాస్తు చేసిన వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. సరదాగా చేసే ఇలాంటి పనుల వల్ల ప్రభుత్వ వ్యవస్థ సమయం వృథా అవ్వడరమే కాదు, అధికారులు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందన్నారు. ప్రభుత్వ సేవల దురి్వనియోగాన్ని సహించబోమన్న కలెక్టర్.. భవిష్యత్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ నెల 24వ తేదీన మసౌరీ రెవెన్యూ అధికారులు ‘డాగ్ బాబు’పేరుతో ఓ శునకానికి నివాస పత్రాన్ని జారీ చేశారు. అందులో ‘డాగ్ బాబు’తండ్రిపేరు కుత్తా బాబు, తల్లి పేరును కుతియాదేవిగా పేర్కొన్నారు. ఈ సర్టీఫికెట్ ఆన్లైన్లో తెగ వైరల్ అయ్యింది. స్పందించిన అధికారులు.. విషయం తమ దృష్టికి రాగానే సర్టీఫికెట్ రద్దు చేశామని తెలిపారు. ఈ దరఖాస్తు చేసిన వ్యక్తి, కంప్యూటర్ ఆపరేటర్పైనా చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. -
డాగ్ బాబు సన్నాఫ్ కుత్తా బాబు!
పట్నా: బిహార్‌లో రెవెన్యూ అధికారులు ఓ శునకానికి రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ చేశారు. డాగ్ బాబు పేరిట ఈ నివాస ధృవీకరణ పత్రం జారీ అయింది. ఇందులో అభ్యర్థి పేరు డాగ్‌బాబు అని, అతని తండ్రి పేరు కుత్తా బాబు, తల్లి పేరు కుత్తియా దేవి అని రాసి ఉంది. వీళ్ల ఇంటి చిరునామా కాలమ్‌లో ‘మొహల్లా కౌలిచక్, వార్డు నంబర్–15, నగర పరిషత్, మసౌరీ పట్టణం’’అని రాసి ఉంది. గోల్డెన్ రిట్రీవర్ జాతి వీధి శునకం ఫొటోతో ఈ ధృవపత్రం జారీచేశారు. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్‌పై అక్కడి రెవెన్యూ అధికారి మురారీ చౌహాన్ డిజటల్ సంతకం ఉంది. ఇది 2025 జూలై 24న ఈ సర్టిఫికేట్‌ను జారీచేశారు. సంబంధిత ప్రభుత్వ పోర్టల్‌లో ఆన్లైన్లో ప్రత్యక్షమవడంతో ఈ అంశం ఇప్పుడు బిహార్‌లో చర్చనీయాంశమైంది. ఢిల్లీకి చెందిన ఒక మహిళ పత్రాలకు ఈ సర్టిఫికేట్ జారీ కోసం దురి్వనియోగం చేసినట్లు తెలుస్తోంది. బిహార్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) నేపథ్యంలో శునకానికీ రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీకావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఎస్ఐఆర్ ఆమోదం పొందుతున్న సర్టిఫికెట్లలో ఇలాంటి వింతలు ఎన్నో ప్రత్యక్షమవుతున్నాయని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ‘మీరే చూడండి. జూలై 24వ తేదీన ఒక శునకానికి బిహార్‌లో నివాస ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ఆమోదం పొందుతున్న సర్టిఫికెట్లలో చాలా వరకు ఇలాంటివి ఉన్నాయి. అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్న ఓటర్లకు గతంలో జారీ అయిన ఆధార్, రేషన్ కార్డులు నకిలీవని అధికారులు ఓవైపు చె బుతూనే మరోవైపు ఇలా శునకాలకు నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు’’అని విమర్శకులు సంబంధిత శునకం సర్టిఫికెట్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌చేశారు. దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. సర్టిఫికెట్ జారీపై అంతటి విమర్శలు రావడంతో పట్నా జిల్లా మేజి్రస్టేట్ వెంటనే స్పందించారు. ‘మసౌరీ జోన్లో డాగ్ బాబు పేరుతో నివాస ధ్రువీకరణ పత్రం జారీ చేసిన అధికారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నాం. దోషులైన ఉద్యోగులు, అధికారులపై శాఖాపరమైన, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం’’అని జిల్లా మేజి్రస్టేట్ తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్ చేశారు. -
నివాస ధ్రువీకరణ పత్రాల కోసం తహసీల్దార్ ఘోరావ్
కవిటి (శ్రీకాకుళంజిల్లా): నివాస ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా రెవెన్యూ సిబ్బంది మోకలడ్డుతున్నరని బెంత ఒడియాలకు చెందిన విద్యార్థులు మంగళవారం తహసీల్దార్ వెంకటేశ్వరరావును ఘోరావ్ చేశారు. కవిటి మండలంలో దాదాపు ఎనిమిది వేల మంది బెంత ఒడియాలు నివసిస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం కోసం నివాస ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. వీటిని రెవెన్యూ వీటిని తిరస్కరించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వందలాది మంది పేద బెంతొ ఒడియా విద్యార్ధులు ఫీజు రీయంబర్స్మెంట్ పధకానికి దూరం అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. కవిటిలో రైతుసాధికారిక సదస్సు బహిష్కరణ కవిటి మండలంలో రైతులు కనీసం ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదని,పై-లీన్ తుఫాన్ నష్టపరిహారం కూడా ఇప్పటికీ పంపిణీ కాలేదని మంగళవారం కవిటి రెవెన్యూ,గ్రామపంచాయితీ పరిధిలో నిర్వహించిన సాధికార సదస్సును బహిష్కరించారు. సదస్సును బహిష్కరించిన రైతుల్లో అధికశాతం టీడీపీ అనుయాయులే ఉండడం గమనార్హం. రైతునేత మాజీ సర్పంచ్ బెందాళం వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రుణమాఫీకి ఏరకంగా కవిటి పంచాయితీ రైతులు అనర్హులో తెలుపకుండానే తూతూమంత్రంగా సభలు నిర్వహించడం ఎందుకన్నారు. సదసు్సును వ్యతిరేకించిన రైతుల్లో అధికశాతం టీడీపీ అనుయాయులే ఉండడం వారు సైతం తమ నిరసనను బహిరంగంగా తెలిపారు.