కేరళ విమాన ప్రమాదానికి కారణం ఇదేనా!

DGCA: Air India Flight Was At Full Speed While Landing At Calicut Airport - Sakshi

తిరువనంతపురం : దుబాయ్ నుంచి కేరళలోని కోళీకోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం క్యారిపూర్ ఎయిర్ పోర్టు రన్‌వేపై ప్రమాదానికు గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం రాత్రి కోళీకోడ్‌ విమనాశ్రయంలో విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో రన్‌వేపై నుంచి పక్కకు జారి లోయలో పడి ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో విమానం రెండు ముక్కలైంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో పది మంది చిన్నారులు.. ఇద్దరు పైలట్లు, అయిదుగురు క్యాబిన్ క్రూ ఉన్నారు. (విమాన ప్రమాదం : 17 మంది దుర్మరణం)

క్యారిపూర్ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ సమయంలో దుబాయ్-కోళీకోడ్ విమానం పూర్తి వేగంతో ఉందని, రన్‌వేను ఓవర్‌షాట్ చేసిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. ల్యాండింగ్‌కు రెండు సార్లు ప్రయత్నించడం, కాస్త ఎక్కువ వేగంతో ల్యాండ్‌ అవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో పైలట్లు ఇద్దరూ చనిపోయారని, క్యాబిన్ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని ఎయిర్ ఇండియా ప్రకటించింది. మరోవైపు ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముగిశాయి. (విమాన ప్రమాదం: అత్యవసర సమావేశం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top