ఢిల్లీలో అత్యంత శీతల అక్టోబర్‌

Delhi Records Coldest October In 58 Years - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాసులు గత 58 ఏళ్లలోనే ఎన్నడూ లేనంత శీతల పరిస్థితులను ఈ అక్టోబర్‌ నెలలో చవిచూశారు. 1962 అక్టోబర్‌ నెల సరాసరి కనిష్ట ఉష్ణోగ్రత 16.9 డిగ్రీల సెల్సియస్‌ కాగా దాదాపు 62 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో ఈ ఏడాది అక్టోబర్‌లో సరాసరి కనిష్ట ఉష్ణోగ్రతలు 17.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. సాధారణంగా ఢిల్లీలో సరాసరి కనిష్ట ఉష్ణోగ్రత 19.1 డిగ్రీలుగా ఉంటుంది.

ఢిల్లీలో గురువారం కనిష్ట ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో 12.5 డిగ్రీలు కాగా.. దాదాపు 26 ఏళ్ల తర్వాత, 1994 తర్వాత ఇంత తక్కువగా నమోదైందని ఐఎండీ పేర్కొంది. గాలి వేగం మందగించడం, ఆకాశం మేఘావృతమై ఉండటమే ఈ పరిస్థితికి కారణమని ఐఎండీకి చెందిన కుల్దీప్‌ శ్రీవాస్తవ వివరించారు. ఏటా సాధారణంగా ఇదే సమయంలో కనిష్ట ఉష్ణోగ్రత 15–16 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉంటుందని తెలిపారు. ఢిల్లీలో ఆల్‌టైం కనిష్ట ఉష్ణోగ్రత 1937 అక్టోబర్‌ 31వ తేదీన 9.4 డిగ్రీలుగా నమోదు అయ్యింది.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top