ఆ ఘటనని జీవితంలో మరచిపోలేను: నటి

Delhi Man Attempts To Trespass Into Elnaaz Norouzi Room In Goa - Sakshi

న్యూఢిల్లీ: జీవితం అంటేనే అనుభవాల సమాహారం. వాటిల్లో కొన్నిమంచివైతే, మరికొన్ని బాధ కల్గించేవిగా ఉంటాయి. అయితే బాధ పడ్డ సంఘటనలు మాత్రం జీవితాంతం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. తన జీవితంలో కూడా ఇలాంటి చేదు అనుభవం ఉంది అంటున్నారు బాలీవుడ్ ‌నటి ఎల్నాజ్‌ నోరోజి. వివరాల్లోకి వెళ్తే.. ఎల్నాజ్‌ గతంలో ఓ సినిమా షుటింగ్‌లో భాగంగా గోవాకి వెళ్లారు. షుటింగ్‌ ముగిసిన తర్వాత స్నేహితురాలి ఇంటికి వెళ్లి.. అక్కడ కొన్నిరోజులు సరదాగా గడపాలనుకున్నారు. ఈ క్రమంలో ఒక రోజు రాత్రి నటి‌ తన మిత్రుడి బర్త్‌డే పార్టీకి హజరయ్యారు. ఇంటికి వచ్చాక ఎల్నాజ్‌ తన తల్లితో వీడియోకాల్‌ మాట్లాడుతున్నారు.

ఎల్నాజ్‌ ఫోన్‌ మాట్లాడుతూ.. తన గదిలోని కిటికి నుంచి బైటకు చూసి.. షాకయ్యారు. ఏవరో ఆగంతకుడు సెక్యురిటీని దాటి, వారి ఇంటిలోకి ప్రవేశించాడు. కంగారు పడిన ఆమె దీని గురించి తన మిత్రుడికి చెప్పింది. వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆగంతకుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతను ఢిల్లీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడు కేవలం ఎల్నోజ్‌ని కలవడానికి వచ్చాడని.. ఎలాంటి దురుద్దేశం లేదని పోలీసుల విచారణలో బయటపడింది. మరోసారి ఇలాంటి పనులు చేయనని ఆ వ్యక్తి లిఖిత పూర్వకంగా క్షమాపణలు కోరడంతో అతడిని విడిచిపెట్టారు. ఆ తర్వాత తన ఇంటికి చేరుకుంది. అయితే ఇప్పటికి ఆరోజు గుర్తుచేసుకుంటే భయమేస్తోందని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు ఎల్నోజ్‌.

చదవండి: పనిమనిషిపై పైశాచికం.. శరీరంపై 31 గాయాలు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top