Air India Flight-Ants: ‘బలమైన విమానం చీమల చేతచిక్కి ఆగెన్‌’.. ఎలాగంటే!

Delhi-London Air India flight delayed after ants found in business class - Sakshi

న్యూఢిల్లీ: ‘బలవంతమైన సర్పము చలి చీమల చేతచిక్కి చావదె’... అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా! ఆధునిక యుగంలో దీన్ని కాస్త మార్చి ‘బలమైన విమానం చీమల చేతచిక్కి ఆగెన్‌’ అని చదువుకునే చిత్రమైన సంఘటన జరిగింది.  అలాంటి చిత్రమైన ఘటన ఢిల్లీ విమానాశ్రయంలో జరిగింది. లండన్‌ వెళ్లే ఎయిర్‌ఇండియా విమానం చీమల కారణంగా కొన్ని గంటలు ఆగింది. బిజినెస్‌ క్లాసులో చీమల గుంపు కనిపించడంతో టేకాఫ్‌ ఆపేశారు.
(చదవండి: తాలిబన్ల చెరలో నాలుగు విమానాలు!)

ప్రయాణికులను మరో విమానంలోకి ఎక్కించి పంపించారు. ఈ విమానంలోనే భూటాన్‌ యువరాజు జిగ్మే నాంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ ఉన్నారు.  ఎయిర్‌ఇండియా విమానాలు ఇటీవల కాలంలో చిత్రమైన కారణాలతో ఆలస్యం అవుతున్నాయి. ఈ ఏడాది జులైలోనూ సౌదీ అరేబియా వెళ్తున్న ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సరకు రవాణా విమానాన్ని కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. విమానం విండ్‌ షీల్డ్‌లో పగుళ్లు గుర్తించడమే ఇందుకు కారణం. అంతకుముందు మేలో దిల్లీ నుంచి అమెరికా వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానం బిజినెస్‌ క్లాస్‌లో గబ్బిలం ఉన్నట్లు గుర్తించారు.
(చదవండి: Karnataka Toddler Swallowed Coin: ఐదు రూపాయల కాయిన్‌ గొంతులో ఇరుక్కొని)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top