బంగ్లా తీరాన్ని తాకిన మోకా

Deadly Cyclone Mocha slams into Bangladesh, Myanmar - Sakshi

బంగ్లాదేశ్, మయన్మార్‌ల్లో తీవ్ర నష్టం

సాక్షి, విశాఖపట్నం: భీకర మోకా తుపాను ఆదివారం మధ్యాహ్నం బంగ్లాదేశ్, మయన్మార్‌ తీరాన్ని తాకి తీవ్ర నష్టం కలగజేసింది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సముద్రంలో 8–12 అడుగుల ఎత్తున ఎగిసి పడిన అలలు లోతట్టు ప్రాంతాలను ముంచి వేశాయి.

సెంట్‌ మార్టిన్‌ దీవిలో బలమైన గాలులు, భారీగా వానలు కురిశాయి. గత రెండు దశాబ్దాల్లో ఇదే అత్యంత శక్తివంతమైన తుపాను అని అధికారులు తెలిపారు. ఈ తుపాను ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపితే హుద్‌హుద్‌ తరహా పెను విపత్తుకు కారణమయ్యేదని నిపుణులు చెబుతున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top