అమృత మరణం.. ఉప్పుపాతరతో ఊపిరి తిరిగొస్తుందా? | Dead Body Kept In Rock Salt At Chikkaballapur | Sakshi
Sakshi News home page

రీల్స్‌ చేస్తూ నీళ్లలో పడి మృతి.. అమృత బతుకుతుందని ఉప్పుపాతర!

Published Mon, Sep 12 2022 8:16 AM | Last Updated on Mon, Sep 12 2022 8:51 AM

Dead Body Kept In Rock Salt At Chikkaballapur - Sakshi

చిక్కబళ్లాపురం: ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మరణించినవా­రిని ఉప్పు పాతరేస్తే ప్రాణాలు తిరిగొస్తాయనే మూఢ నమ్మకం కన్నడనాట నేటికీ కొనసాగుతోంది. ఇటీవల బళ్లారిలో ఓ బాలుడి మృతదేహాన్ని ఉప్పు పాతరేయడం మరచిపోకముందే... చిక్క­బళ్లాపుర జిల్లాలోనూ అదే తరహా ఘటన చోటుచేసుకుంది.

శిడ్లఘట్ట తాలూకాలోని గాజులవారిపల్లెకు చెందిన ఎంఏ వి­ద్యార్థిని అమృత (22) గంగానహళ్లిలోని బంధువుల ఇంటికి వ­చ్చింది. ఆమె ఆదివారం ఉదయం గ్రామంలోని చెరువు వద్ద సరదాగా రీల్స్‌ చేస్తున్న సమయంలో తీసుకుంటూ జారిపడి నీటిలో మునిగిపోయింది. సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్నవారు వచ్చి అమృతను ఒడ్డుకు తీసుకు­రాగా, అప్పటికే ఆమె చనిపోయింది.

అయితే.. అయినప్పటికీ బంధువులు ఉప్పు పాతర వేస్తే బతుకుతుందనే నమ్మకంతో అమృత మృతదేహాన్ని  ఉప్పులో పెట్టారు. గుడిబండ పోలీసులు కేసు నమో­దు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.  

(చదవండి: బతికి వస్తాడని బాలుడి మృతదేహానికి ఉప్పుపాతర)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement