Covid-19: వారికి ఆర్టీపీసీఆర్‌ తప్పనిసరి

Covid-19: RT-PCR Testing at the entry airport In The International Travelers - Sakshi

చైనా, జపాన్, ద.కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్‌ నుంచి వస్తే తప్పనిసరి

గాంధీనగర్‌/న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ కట్టడి చర్యల్లో భాగంగా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం నడుంబిగించింది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు వైరస్‌ను వ్యాప్తి చేసే అవకాశం ఉండటంతో వారిపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ శనివారం చెప్పారు. వారికి ఎయిర్‌పోర్టుల్లోనే థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తారు. జ్వరంతో బాధపడుతూ పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్‌కు తరలిస్తారు. వాళ్లు ముందుగానే ఎయిర్‌ సువిధ పోర్టల్‌లో దరఖాస్తును నింపాల్సి ఉంటుంది.  

ర్యాండమ్‌గా 2% ప్రయాణికులకు టెస్ట్‌
ఎయిర్‌పోర్ట్‌లో భారత్‌కు చేరుకున్న ప్రయాణికుల్లో ఒక్కో అంతర్జాతీయ విమానంలో ర్యాండమ్‌గా రెండు శాతం చొప్పున ప్రయాణికులకు కరోనా టెస్ట్‌ చేయడం శనివారం నుంచి తప్పనిసరి చేశామని మాండవీయ వెల్లడించారు. ఈ నిబంధనలతో కొత్తరకం వేరియంట్‌ వ్యాప్తిని కనుగొనేందుకు, ముందుగా అప్రమత్తమయ్యేందుకు అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచే ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, గోవా, ఇండోర్, పుణె ఎయిర్‌పోర్టుల్లో అంతర్జాతీయ విమానాల్లో దిగిన ప్రయాణికుల్లో 2 శాతం మందికి టెస్టులు చేశారు. అంటే ఒక్కో విమానం నుంచి దిగిన ప్రయాణికుల సంఖ్యలో 2 శాతం మందిని ర్యాండమ్‌గా ఎంపికచేసిన వారికి కోవిడ్‌ టెస్ట్‌ చేస్తారు. పౌర విమానయాన శాఖ గణాంకాల ప్రకారం శుక్రవారం 29 అంతర్జాతీయ విమానాల్లో 87వేలకుపైగా ప్రయాణికులు భారత్‌లో అడుగుపెట్టారు. టెస్ట్‌కు అయ్యే ఖర్చును ప్రయాణికుడు భరించనక్కర్లేదు. శాంపిళ్లు ఇచ్చేసి ఎయిర్‌పోర్ట్‌ నుంచి వెళ్లిపోవచ్చు. జ్వరంగా ఉండి పాజిటివ్‌గా తేలితే క్వారంటైన్‌ తప్పదు.  

రాష్ట్రాలకు కేంద్రం లేఖ
ఆక్సిజన్‌ సిలిండర్లతోపాటు వెంటిలేటర్లు, బీఐపీఏపీ తదితరాలను సిద్దం చేసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్‌ రాష్ట్రాలకు లేఖ రాశారు. ‘‘ద్రవ మెడికల్‌ ఆక్సిజన్, ఆక్సిజన్‌ సిలిండర్లు, లైఫ్‌ సపోర్ట్‌ పరికరాలు అవసరమైనన్ని అందుబాటులో ఉండేలా చూసుకోండి. ఈఎస్‌ఏ ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు సమర్థంగా పనిచేస్తున్నాయో లేదో చూసుకోండి’’ అని సూచించారు.

కొత్తగా 201 కేసులు
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 201 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,397గా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.15 శాతంగా, వారపు పాజిటివిటీ రేటు 0.14 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 98.80 శాతానికి పెరిగింది.  

మరిన్ని వార్తలు :

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

24-12-2022
Dec 24, 2022, 18:39 IST
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌ను మళ్లీ కోవిడ్‌ భయం వణికిస్తోంది.
24-12-2022
Dec 24, 2022, 11:33 IST
సాక్షి, హైదరాబాద్‌: చైనా తదితర దేశాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా బూస్టర్‌ డోస్‌ వ్యాక్సిన్‌ను తప్పకుండా తీసుకోవాలని ఏఐజీ...
24-12-2022
Dec 24, 2022, 07:57 IST
సాక్షి, అమరావతి: చైనా, ఇతర దేశాల్లో పంపిణీ చేసిన కరోనా టీకాలతో పోలిస్తే మన వ్యాక్సిన్లు చాలా శక్తిమంతమైనవని, వైరస్‌...
24-12-2022
Dec 24, 2022, 05:39 IST
న్యూఢిల్లీ: సూదితో అవసరం లేని కోవిడ్‌–19 టీకా అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన...
24-12-2022
Dec 24, 2022, 04:48 IST
చైనాలో కరోనా కల్లోలం భారత్‌లోనూ భయభ్రాంతులకు కారణమవుతోంది. దేశంలో నాలుగో వేవ్‌ మొదలైపోతుందని ప్రచారం జరుగుతోంది. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియెంట్‌...
23-12-2022
Dec 23, 2022, 09:39 IST
బీజింగ్‌: చైనాలో జీరో కోవిడ్‌ విధానం అకస్మాత్తుగా వెనక్కి తీసుకోవడంతో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియెంట్‌...
23-12-2022
Dec 23, 2022, 04:59 IST
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో మనమంతా ఇక మేల్కొనాలని కేంద్ర ఆరోగ్య...
23-12-2022
Dec 23, 2022, 04:25 IST
సాక్షి, అమరావతి: వివిధ దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు చర్యలు...
23-12-2022
Dec 23, 2022, 04:20 IST
సాక్షి, అమరావతి/డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణ): ఒకవేళ మన రాష్ట్రం­లో కోవిడ్‌ బీఎఫ్‌–7 వేరియంట్‌ ప్రభావం చూపితే.. సమ­ర్థవంతంగా ఎదుర్కొనేందుకు అంతా...
22-12-2022
Dec 22, 2022, 12:24 IST
న్యూఢిల్లీ: చైనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మరోసారి దడ పట్టిస్తోంది. కోవిడ్‌ పుట్టినిల్లుగా భావించే చైనాలో ఒమిక్రాన్‌లో సబ్‌వేరియెంట్‌ ప్రస్తుతం...
22-12-2022
Dec 22, 2022, 12:07 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా కొత్త వేరియంట్‌ బీఎఫ్‌-7పై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న...
22-12-2022
Dec 22, 2022, 11:09 IST
సాక్షి, హైదరాబాద్‌: మన దేశంలో కోవిడ్‌ ఫోర్త్‌వేవ్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నవన్ని ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లేనని,...
22-12-2022
Dec 22, 2022, 01:45 IST
న్యూఢిల్లీ: చైనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో...
22-12-2022
Dec 22, 2022, 00:16 IST
ఒకరికి తెద్దునా... ఇద్దరికి తెద్దునా... అందరికీ తెద్దునా అని జనవ్యవహారం. చైనా తప్పిదాలతో కరోనా మళ్ళీ దేశదేశాల్లో కోరలు సాచే...
21-12-2022
Dec 21, 2022, 03:36 IST
చైనాలో కోవిడ్‌–19 విశ్వరూపం చూపిస్తోంది. ప్రజా నిరసనలకు తలొగ్గి ప్రభుత్వం జీరో కోవిడ్‌ విధానాన్ని వెనక్కి తీసుకున్న దగ్గర్నుంచి కేసులు...
04-11-2022
Nov 04, 2022, 10:36 IST
British man who had COVID for 411 days is cured: దీర్ఘకాలంగా కోవిడ్‌తో బాధపడుతున్న రోగి తాజాగా వైరస్‌...
29-07-2022
Jul 29, 2022, 01:19 IST
కరోనా ఇక కాస్త మందగించిందంటూ మూడో వేవ్‌ దాటిన తర్వాత ప్రజలంతా కొద్దిగా హాయిగా ఊపిరి తీసుకుంటున్న సమయంలో... తన...
26-07-2022
Jul 26, 2022, 03:40 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా టీకాకు సంబంధించిన ప్రికాషన్‌ డోసు పంపిణీపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి...
15-07-2022
Jul 15, 2022, 04:30 IST
సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ కట్టడికి చేపడుతున్న టీకా ప్రక్రియలో మరో కీలక ఘట్టానికి అడుగు పడింది. దేశ వ్యాప్తంగా...
10-07-2022
Jul 10, 2022, 02:55 IST
సాక్షి, అమరావతి: కరోనా టీకా ప్రికాషన్‌ డోసు కాల వ్యవధిని 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించినట్టు రాష్ట్ర... 

Read also in:
Back to Top