షాకింగ్‌ వీడియో.. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన జంట.. ఆ తర్వాత..

Couple Falls Into Water Logged Ditch In Uttar Pradesh - Sakshi

వానా కాలంలో మ్యాన్‌హోల్స్‌ తెరిచి ఉండటం అందులో వాహనదారులు పడిపోవడం మనం చూసే ఉంటాము. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. స్కూటీపై వెళ్తున్న ఓ పోలీసు దంపతులు నీటి గుంతలో పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. అలీఘఢ్‌లోని కిషన్‌పూర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా అక్కడి వీధులు, రోడ్డు వరద నీటితో నిండిపోయాయి. ఈ క్రమంలో వరద నీరు వెళ్లిపోయేందుకు అధికారులు మ్యాన్‌హోల్స్‌ తెరిచిపెట్టారు. అయితే, మ్యాన్‌హెల్స్‌ వద్ద ఎలాంటి ప్రమాద హెచ్చరికలు పెట్టకపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. 

పోలీసు అధికారి దయానంద్‌ సింగ్‌ అత్రి, ఆయన భార్య అంజు అత్రి దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. స్కూటీపై ఆసుపత్రికి వెళ్లిన దంపతులు తమ వాహనాన్ని రోడ్డు పక్కగా పార్క్‌ చేసేందుకు వెళ్లే క్రమంలో తెరిచి ఉన్న మ్యాన్‌ హోల్‌లో స్కూటీతో పాటు పడిపోయారు. దీంతో వారిద్దరూ మ్యాన్‌హెల్‌లో మునిగిపోయారు. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు వారిని కాపాడారు. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇది కూడా చదవండి: పది రూపాయాల నాణేలతో కారు కొనుగోలు...కారణం వింటే ఆశ్చర్యపోతారు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top