ధైర్యం చెప్పిన ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ 

Corona Will Be Control In June Says Odisha Health Director Niranjan Mishra - Sakshi

జూన్‌ నెలలో కోవిడ్‌ తగ్గుముఖం పడుతుందని ప్రకటన

భువనేశ్వర్‌: రాష్ట్రంలో కోవిడ్‌- 19 సంక్రమణ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. జూన్‌ నెలలో తగ్గుముఖం పట్టి ఊరట కలిగిస్తుందని, భయాందోళన చెందాల్సిన పనిలేదని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ నిరంజన్‌ మిశ్రా సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే నెలలో పాజిటివ్‌ రేటు బెంబేలెత్తించింది. 3 లక్షల 20 వేల 803 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ నమోదైంది. 711 మంది కోవిడ్‌ రోగులు మృతి చెందారు. మే 22వ తేదీన ఒక్కరోజునే 12 వేల 852 మందికి పాజిటివ్‌ నమోదు కావడం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. 4 వారాల తర్వాత లాక్‌డౌన్‌ ప్రభావం కనిపిస్తోంది. కోవిడ్‌ పాజిటివ్‌ రేటు అధికంగా నమోదైన సుందరగడ్, నువాపడా, గజపతి, సుందరగడ్‌  జిల్లాల్లో తగ్గుముఖం పట్టింది. ఈ జిల్లాల్లో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల పాజిటివ్‌ రేటు 10 శాతం కంటే తక్కువగా ఉందన్నారు.

త్వరలో కోవిషీల్డ్‌ టీకాలు
రాష్ట్రానికి త్వరలో కోవిషీల్డ్‌ టీకాలు సరఫరా కానున్నాయి. జూన్‌ నెల 3వ తేదీ నాటికి 3 లక్షల 5 వేల 460 మోతాదుల కోవిషీల్డ్‌ టీకాలు చేరుతాయి. ఈ విడత టీకాల్ని ప్రధానంగా 45 ఏళ్లు పైబడిన వారి కోసం  వినియోగిస్తామని తెలిపారు. జూన్‌ 6వ తేదీ నాటికి మరో 40 వేల మోతాదుల కోవ్యాక్సిన్‌ టీకాలు రాష్ట్రానికి చేరుతాయని చెప్పారు. కోవిడ్‌ పాజిటివ్‌ రేటు అధికంగా కొనసాగుతున్న రాష్ట్రంలోని 5 మునిసిపల్‌ కార్పొరేషన్లు, 6 జిల్లా ప్రధాన కార్యాలయాల్లో కోవిడ్‌ టీకాల కార్యక్రమానికి ప్రాధాన్యం కల్పిస్తామని తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top