కార్పొరేట్‌ ఆస్పత్రుల ‘కరోనా కాటు’

Corona Crisis: India Should Regulate Private Health Care - Sakshi

(వెబ్‌ స్పెషల్‌): ప్రాణాంతక కరోనా వైరస్‌ బారిన పడిన ప్రజలను పట్ట పగటి దొంగల్లా పలు ప్రైవేటు ఆస్పత్రులు దోచుకుంటున్నాయంటూ సోషల్‌ మీడియాలో ఇప్పటికీ వార్తలు వెల్లువెతున్న విషయం తెల్సిందే. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యం ఖర్చులను క్రమబద్దీకరించేందుకు దేశంలోని దాదాపు 15 రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగినప్పటికీ ఇప్పటికీ వాటి ముక్కుకు తాడేయలేక పోతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వాలను నమ్ముకుంటే లాభం లేదనుకున్న వారు. సరైన మార్గదర్శకాల కోసం ఇప్పటికే సుప్రీం కోర్టు తలుపులు తట్టారు. రిట్‌ పిటిషన్లు దాఖలు చేశారు. ‘ఆల్‌ ఇండియా డ్రగ్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌’ కూడా తన వంతు ధర్మంగా రిట్‌ పిటిషన్లో భాగస్వామిగా చేరింది.

కరోనా వైరస్‌ మహమ్మారి మానవాళిపై విరచుకుపడకు ముందు నుంచే దేశంలోని పలు ప్రైవేటు కార్పొరేట్‌ ఆస్పత్రులు చికిత్స పేరిట దోచుకుంటున్నాయి. మందులు, ఇంజెక్షన్లపై కార్పొరేట్‌ ఆస్పత్రులు 1700 శాతం లాభాలు చూసుకుంటున్నట్లు ‘నేషనల్‌ ఫార్మాస్యూటికల్‌ ప్రైసింగ్‌ అథారిటీ’ గతంలో ఓ నివేదికలో కూడా వెల్లడించింది. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోక పోవడంతో కార్పోరేట్‌ ఆస్పత్రుల దోపిడీ ఇప్పటికీ కొనసాగుతూ కరోనా మహమ్మారి సంక్షోభం నాటికి తారా స్థాయికి చేరుకుంది. నేడు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో బిల్లుల్లో ఎక్కడా పారదర్శకత అనేది లేకుండా పోయింది. మాస్క్‌లు, గ్లౌజులు లాంటి వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ)ను ఓ రోగికి ఎన్ని సరఫరా చేశారో, వాటి ధర ఎంతో పేర్కొనకుండా వీటికి లెవీ చార్జీలు రోజుకు అంటూ పది నుంచి పదిహేను వేల రూపాయల చార్జీలను వసూలు చేస్తున్నాయి.

రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ చార్జీలు, వ్యర్థ వైద్య పరికరాల తరలింపు, ఆస్పత్రి అడ్మిషన్, రోగి వైద్య చరిత్ర అంచనా, వైద్య పరికరాల వినియోగ, ముందు జాగ్రత్త, పార్కింగ్‌ చార్జీల పేరిట ఒక్కో రోగి నుంచి లక్షల రూపాయలు కార్పొరేట్‌ ఆస్పత్రులు పిండుతున్నాయని దేశంలోని మూడు నగరాల్లోని కార్పొరేట్‌ ఆస్పత్రలు బిల్లులను పరిశీలించిన ‘ఆల్‌ ఇండియా డ్రగ్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌’ సుప్రీం కోర్టు పిటిషన్‌లో పేర్కొంది. (కరోనా లక్షణాలు లేనివారిలో‌.. వెరీ డేంజర్‌!)

కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు కరోనా రోగులపై వారి అనుమతి లేకుండా ‘ఫేవిపిరావిర్, హెచ్‌సీక్యూ, టోసిలిజుమాబ్, లోపినవిర్‌ ప్లస్‌ రిటోనవిర్, రెమిడిసివిర్‌ లాంటి మందులను ప్రయోగిస్తున్నట్లు కూడా ఏఐడీఏఎన్‌ ఆరోపించింది. కరోనా చికిత్సకు ఆస్పత్రులు వేస్తున్న చార్జీలు, బిల్లులు ఏకపక్షంగానే కాకుండా అహేతుకంగా ఉంటుండంతో వైద్య బీమా కంపెనీలు కూడా రోగుల బిల్లులను చెల్లించేందుకు నిరాకరిస్తున్నాయి. కొన్ని బీమా కంపెనీలు పాక్షికంగానే బిల్లులను చెల్లిస్తున్నాయి. వ్యక్తిగత రక్షణ పరికరాలు రోగికి అవసరం లేదని, రోగి నుంచి ఆస్పత్రి సిబ్బందికి అంటురోగాలు అంటుకోకుండా వినియోగించడానికంటూ వాటి చార్జీలను పూర్తిగా చెల్లించేందుకు నిరాకరిస్తూ వచ్చిన కంపెనీలు, ఇప్పుడు పది, హేను వేల బిల్లులకు ఒకటి, రెండు వేల రూపాయలను చెల్లిస్తున్నాయి.

ఎలాంటి పారదర్శకత లేకుండా కార్పొరేట్‌ ఆస్పత్రులు తమ ఇష్టానుసారం రోగులపై అడ్డగోలుగా బిల్లులు వేస్తున్నాయని, వైద్య బీమాలేని రోగులకంటే బీమా ఉన్న రోగులపై వాటి వడ్డింపులు ఎక్కువగా ఉంటున్నాయని ‘జనరల్‌ ఇన్యూరెన్స్‌ కార్పొరేషన్‌’ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి వైద్యానికి వేర్వేరు చార్జీలను నిర్దేశించడమే కాకుండా వైద్య బీమా విషయంలో విభిన్న వైఖరులను అవలంభించడం కూడా కార్పోరేట్‌ ఆస్పత్రుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు ప్రభుత్వం నిర్దేశించిన కరోనా వైద్య చార్జీల నుంచి వైద్య బీమా వినియోగదారులను మినహాయించగా, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైద్యానికి చార్జీలను నిర్దేశిస్తూ జూన్‌ 20వ తేదీన జారీ చేసిన ఉత్తర్వులో వైద్య బీమా వినియోగదారులను మినహాయించ లేదు. అయినప్పటికీ అక్కడి కార్పొరేట్‌ ఆస్పత్రులన్నీ వైద్య బీమా ఉన్న ప్రజలను ప్రభుత్వ చార్జీల నుంచి ఏకపక్షంగా మినహాయించాయి.

ప్రభుత్వం నిర్దేశించిన కరోనా వైద్య చార్జీలను అమలు చేసేందుకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఐఏఎస్‌ అధికారులతో కమిటీలు వేసి తనిఖీలు చేయిస్తుండగా, ముంబై, బెంగళూరు నగరాల్లో మాత్రం అధికార కమిటీలు అధిక చార్జీలను వసూలు చేసిన కార్పోరేట్‌ ఆస్పత్రుల నుంచి వాటిని వసూలు చేసి రోగులకు ఇప్పించాయి. అసోసియేషన్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్‌ ప్రొవైడర్స్‌ ఆఫ్‌ ఇండియా, హెల్త్‌కేర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఫిక్కీ సంస్థలు కార్పోరేట్‌ ఆస్పత్రుల్లో కరోనా వైద్యం చార్జీలను క్రమబద్దీకరించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయి. కార్పొరేట్‌ ఆస్పత్రుల లాబీ వల్ల, వాటి దోపిడీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలను తీసుకరాలేక పోతున్నాయి. ఉన్న చట్టాలను కూడా సక్రమంగా అమలు చేయలేక పోతున్నాయి. ఫిక్కీలాంటి సంస్థల్లో కూడా కార్పొరేట్‌ ఆస్పత్రుల ప్రాతినిథ్యం బలంగా ఉండడంతో క్రియాశీలకంగా వ్యవహరించలేక పోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన కార్పొరేట్‌ ఆస్పత్రుల లైసెన్సులను తక్షణమే రద్దు చేసి, వాటిని ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడం ఒక్కటే ఏకైక పరిష్కార మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.  (‘క‌రోనా పురుగు’ను కామెడీతో చంపేశారుగా!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

20-10-2020
Oct 20, 2020, 10:38 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 42,299 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,486 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి....
20-10-2020
Oct 20, 2020, 09:25 IST
సాక్షి, విజయవాడ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాతో రోజుకో కొత్త సమస్యలు వెలుగు చూస్తోంది. ఇప్పటి వరకూ కరోనాతో పలువురిలో మధుమేహం స్థాయిలు...
19-10-2020
Oct 19, 2020, 19:45 IST
సాక్షి, కృష్ణా: కొత్తగా కరోనా పొజిటివ్ కేసులు నమోదు కావటంతో జిల్లాలో 6 కంటైన్మెంట్ జోన్‌లను ప్రకటించినట్లు కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు....
19-10-2020
Oct 19, 2020, 10:12 IST
ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 66,63,608. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 7,72,055. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ...
19-10-2020
Oct 19, 2020, 09:00 IST
కైవ్‌: కరోనా వైరస్‌ బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది మరణిస్తున్నారు. అయితే ఇప్పటికి చాలా మందిలో కరోనా వైరస్‌కు...
19-10-2020
Oct 19, 2020, 08:42 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 26,027 కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు...
19-10-2020
Oct 19, 2020, 04:32 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెప్టెంబర్‌లో గరిష్ట స్థాయిని దాటి పోయిందని కోవిడ్‌–19పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ...
19-10-2020
Oct 19, 2020, 03:19 IST
సాక్షి, అమరావతి: కరోనా రికవరీలోనూ ఆంధ్రప్రదేశ్‌ ముందుకు దూసుకుపోతోంది. కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరగడంతో ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో...
19-10-2020
Oct 19, 2020, 03:05 IST
సాక్షి, హైదరాబాద్‌: దసరా, దీపావళి పండగల వేళ కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న దృష్ట్యా దీన్ని నివారించేందుకు...
18-10-2020
Oct 18, 2020, 15:48 IST
సాక్షి, న్యూఢిల్లీ :  కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ శశిథరూర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. విమర్శలు ఎదుర్కొంటున్నారు. కరోనా నియంత్రణ విషయంలో...
18-10-2020
Oct 18, 2020, 14:29 IST
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ ముమ్మర దశను దాటిందని వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మహమ్మారి అంతం...
18-10-2020
Oct 18, 2020, 10:25 IST
న్యూఢిల్లీ: దేశ్యాప్తంగా కరోనాబారినపడి మరో 1033 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,14,031 కు చేరింది....
18-10-2020
Oct 18, 2020, 09:55 IST
లక్నో: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి భారత్‌లో రోజురోజుకూ విజృంభిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1,14,031 మందిని పొట్టనబెట్టుకుంది. బిహార్‌లోనూ పంజా...
17-10-2020
Oct 17, 2020, 18:59 IST
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
17-10-2020
Oct 17, 2020, 17:53 IST
రష్యా అభివృద్ది చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కు మన దేశంలో అనుమతి లభించింది.
17-10-2020
Oct 17, 2020, 14:52 IST
కరోనా తీవ్రత ఎక్కువగా ప్రాంతాల్లో భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు కూడా భౌతిక దూరాన్ని పాటించాల్సిందేనంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
17-10-2020
Oct 17, 2020, 14:05 IST
సాక్షి, హైదరాబాద్‌: న‌టుడు జీవితా రాజ‌శేఖ‌ర్ కుటుంబ సభ్యులు క‌రోనా మహమ్మారి బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా రాజ‌శేఖ‌ర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు....
17-10-2020
Oct 17, 2020, 12:59 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. అయితే ఈ వ్యాక్సిన్‌...
17-10-2020
Oct 17, 2020, 11:50 IST
తిరువనంతపురం : దాదాపు ఏడు నెలల తర్వాత కేరళలోని శబరిమల ఆలయంలోకి భక్తులను అనుమతించారు. నెలవారీ పూజా కార్యక్రమాల్లో భాగంగా అయిదు రోజుల...
17-10-2020
Oct 17, 2020, 10:38 IST
వాషింగ్టన్‌: ప్రపంచంలో అత్యధికంగా అమెరికాలో ఇప్పటికే కరోనా కేసులు 8 మిలియన్లు దాటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల నాటికి...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top