కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిపై పృథ్వీరాజ్‌ చవాన్‌ కీలక వ్యాఖ్యలు

Congress Shouldnot have a Puppet President, Says Prithviraj Chavan - Sakshi

ముంబై: కాంగ్రెస్‌ నేతలందరూ కలసి ఎన్నుకునే వ్యక్తి పార్టీకి తోలుబొమ్మ అధ్యక్షుడిగా ఉండకూడదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ కేంద్రమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ పేర్కొన్నారు. శుక్రవారం ముంబైలోని విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో పార్టీని సమర్థవంతంగా నడిపించేందుకు కాంగ్రెస్‌ శ్రేణులు కొత్తగా ఎన్నికైన పార్టీ అధ్యక్షుడికి తగిన సహాయ సహకారాలు అందించాలని ఆయన సూచించారు.

పాతికేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ అజాద్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా..ఆయన రాజీనామా దురదృష్టకరమన్నారు. పార్టీలో ఆయన సీనియర్‌ నేతని, ఆయన లౌకికవాదని వివరించారు.

గ్రూప్‌ 23లో ఉన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలంతా పార్టీలో అంతర్గత సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి 2020లో లేఖ ఇచ్చామని, అయితే పార్టీ ప్రయోజనాలకు కాపాడేందుకు, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు మాత్రమే ఆ లేఖను ఇచ్చామని అయితే పార్టీలోని కొంతమంది దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

చదవండి: (Congress Party: కాంగ్రెస్‌ పార్టీకి మరో బిగ్‌ షాక్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top