2 రాష్ట్రాల్లో కరెంటు కష్టాలు

Coal crisis leads to power cuts across Delhi and Punjab - Sakshi

న్యూఢిల్లీ: బొగ్గు కొరత కారణంగా ఢిల్లీ, పంజాబ్‌లకు కరెంటు కోతలు తప్పకపోవచ్చని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. థర్మల్‌ ప్లాంట్లకు అవసరమైన బొగ్గును కేంద్రం సరఫరా చేయాలన్నారు. దేశ రాజధానికి విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్లకు అవసరమైన బొగ్గు, గ్యాస్‌ సరఫరా అయ్యేలా జోక్యం చేసుకోవాలని కోరు తూ ప్రధాని మోదీకి లేఖ రాసినట్లు సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. ఎన్‌టీపీసీ నుంచి విద్యుత్‌ అందకుంటే రానున్న రోజుల్లో కోతలు తప్పకపోవచ్చన్నారు. పంజాబ్‌లోని ధర్మల్‌ ప్లాంట్లు బొగ్గు కొరత కారణంగా తక్కువ సామర్థ్యంతో పనిచేస్తున్నాయని సీఎం చెన్నీ చెప్పారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top